మోసం చేసిన హీరోతోనే ముద్దు ముచ్చట్లా!

మోసం చేసిన హీరోతోనే ముద్దు ముచ్చట్లా!

 బాగా ఆటిట్యూడ్‌ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నయనతార బాగా ఎమోషనల్‌ అట. అందుకేనేమో ఇట్టే ప్రేమలో పడిపోయి మళ్లీ మామూలుగా తిరిగేస్తుంటుంది. శింబుతో చాలా దూరం వెళ్లిన నయనతార అప్పట్లో తన క్యారెక్టర్‌పై మచ్చ వేయించుకుంది. తమ ప్రైవేట్‌ ఫోటోలు శింబు స్వయంగా లీక్‌ చేసాడని అభియోగాలున్నాయి. ప్రేమించిన తనని అంతగా మోసం చేసిన శింబు వల్ల గాయపడ్డ నయనతార ఆ బాధలో వెళ్లి ప్రభుదేవా వద్ద సేద తీరింది. అతడిని పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పిన నయనతార మళ్లీ ఎందుకో అతడినీ వదిలేసింది.

 కొంత కాలంగా ఏ లవ్‌లు లేకుండా ఉంటోన్న నయన మళ్లీ శింబుకి దగ్గరైందని కోలీవుడ్‌ టాక్‌. శింబుతో మళ్లీ నటిస్తున్న నయనతార ఇప్పుడు అతడితో కలిసి పార్టీలకి కూడా అటెండ్‌ అవుతోందట. నయనతో చెడిన తర్వాత హన్సికతో అఫైర్‌ సాగించిన శింబు ఆమెతోను విడిపోయాడు. ఈ మాజీ ప్రేమికులు ఇద్దరూ ఇప్పుడు ఫ్రెష్‌గా లవ్‌లో పడ్డారనేది నిజమే అనుకుంటే ఆనాడు తనని దారుణంగా మోసం చేసాడని వాపోయిన నయనతార అదంతా మర్చిపోయిందా? చపలచిత్తుడని పేరున్న శింబు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడని అనుకుంటోందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు