త్రిష సెకండ్ హీరోయినా?!

త్రిష సెకండ్ హీరోయినా?!

పువ్వులు అమ్మిన చోటే క‌ట్టెలు అమ్ముకోవ‌డ‌మంటే ఇదేనేమో. ఒక‌ప్పుడు ఆమె కాల్‌షీట్ల కోసం నిర్మాత‌లు ఎగ‌బ‌డేవారు. స్టార్ హీరోలు సైతం త్రిష ప‌క్కన న‌టించ‌డానికి ఆస‌క్తి ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి త‌ల‌కిందులైంది. పుష్కర‌కాలంగా ప‌రిశ్రమ‌లో కొన‌సాగుతున్న త్రిష ప్రేక్షకుల‌కు బోర్ కొట్టేసింది. మ‌రోప‌క్క యువ కెరటాలు జోరు ప్రద‌ర్శిస్తుండ‌టంతో ఈ చెన్నై చిన్నది వెన‌క‌బ‌డిపోయింది. తెలుగులో అయితే అస్సలు అవ‌కాశాలే లేవు. త‌మిళంలో అడ‌పాద‌డ‌పా చేస్తోంది కానీ... స‌రైన ఫ‌లితాలు ద‌క్కడం లేదు. అందుకే ఇప్పుడు క‌న్నడ‌, మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మల‌పై దృష్టిపెట్టింది.

తాజాగా అమ్మడికి త‌మిళంలో సెకండ్ హీరోయిన్‌గా ఓ అవ‌కాశం ద‌క్కిన‌ట్టు స‌మాచారం. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శక‌త్వంలో అజిత్ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో అనుష్క క‌థానాయిక‌. రెండో క‌థానాయిక‌గా త్రిష‌ని ఎంచుకొన్నార‌ట‌. తొలుత ఈ ఆఫ‌ర్‌ని ఒప్పుకోవ‌డానికి త్రిష త‌ట‌ప‌టాయించినా... గౌత‌మ్ మీన‌న్ సినిమా కావ‌డంతో కాద‌న‌లేక ఒప్పుకొంద‌ట‌. పైగా చేతిలో కూడా సినిమాలేవీ లేవు కాబ‌ట్టి వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకోకుండా చేసేయ‌డ‌మే బెట‌ర్ అనుకొంద‌ట‌. త్వర‌లోనే చిత్రబృందంతో జాయిన్ కాబోతోంద‌ని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు