కళ్యాణ్‌ కష్టాలు తీరిపోయినట్టే

కళ్యాణ్‌ కష్టాలు తీరిపోయినట్టే

    కళ్యాణ్‌రామ్‌ నిర్మించిన చిత్రాల్లో చాలా వరకు అతనికి తీవ్ర నష్టాలు తెచ్చిపెట్టాయి. తనకి స్టార్‌డమ్‌ లేకపోవడంతో తను హీరోగా నటించిన సినిమాలు ముందుగా అమ్ముడు కాక... చాలా వరకు తనే రిలీజ్‌ చేసుకున్నాడు. అవన్నీ అతడికి నష్టాలు తెచ్చి పెట్టాయి. ఓం 3డి చిత్రం కళ్యాణ్‌రామ్‌ని కోలుకోలేని దెబ్బ తీసింది. దాంతో తను హీరోగా కాకుండా వేరే హీరోలతో సినిమాలు తీసి నష్టాలు భర్తీ చేసుకోవాలని చూస్తున్నాడు. రవితేజతో సురేందర్‌ దర్శకత్వంలో కిక్‌ 2 నిర్మించడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఆమధ్య బాలకృష్ణతో ఒక సినిమా నిర్మించాలని ప్రయత్నించాడు. కానీ హరికృష్ణతో బాలకృష్ణ సంబంధాలు చెడడంతో ఆ చిత్రం కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు తన సోదరుడు ఎన్టీఆర్‌కి కళ్యాణ్‌రామ్‌ దగ్గర కావడంతో అతడి కష్టాలని తీర్చే బాధ్యత ఎన్టీఆర్‌ తీసుకున్నాడని వినిపిస్తోంది. కళ్యాణ్‌రామ్‌ బ్యానర్‌లో ఎన్టీఆర్‌ హీరోగా త్వరలోనే సినిమా రూపొందుతుందట. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించడానికి ఎన్టీఆర్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకూలిస్తే ఆ ప్రాజెక్ట్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తాడు. ఈలోగా ఎన్టీఆర్‌ ఒక రెండు హిట్లు కూడా కొట్టినట్టయితే కళ్యాణ్‌రామ్‌ కష్టాలన్నీ సింగిల్‌ షాట్‌లో తీరిపోతాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English