బాలకృష్ణ లేకపోయినా ఎన్టీఆర్‌ ఉన్నాడుగా

 బాలకృష్ణ లేకపోయినా ఎన్టీఆర్‌ ఉన్నాడుగా

   నందమూరి కళ్యాణ్‌రామ్‌కి బాబాయ్‌ అంటే చాలా ఇష్టమని అతని మాటలు వింటేనే అర్థమవుతుంది. ఓం 3డి సినిమా ఆడియో వేడుకకి బాలయ్య రాకపోవడంతో పాపం స్టేజీ మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన తండ్రిని, తమ కుటుంబాన్ని బాలకృష్ణ పూర్తిగా పక్కన పెట్టేయడాన్ని కళ్యాణ్‌రామ్‌ జీర్ణించుకోలేకపోయాడు. అయితే తమ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీకే దూరం చేయడంతో ఇప్పుడు అన్నదమ్ములు ఒక్కటయ్యారు. మునుపటి కంటే ఇప్పుడు ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. ఎన్నికలు అయ్యే వరకు మీడియా ముందుకి రాని ఎన్టీఆర్‌ ఈరోజు కళ్యాణ్‌రామ్‌ సినిమా పటాస్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసాడు. హరికృష్ణ.. ఆయన ఇద్దరు కొడుకులు ఈ ప్రారంభోత్సవంలో ఫాన్స్‌కి కన్నుల పండుగ చేసారు. నందమూరి ఫ్యామిలీకి, పార్టీకి హరికృష్ణ కుటుంబం ఇప్పుడు దూరమైందనేది సుస్పష్టం. అయితే దాని గురించి మాట్లాడేందుకు... రాజకీయాల గురించి ప్రస్తావించేందుకు ఎవరూ ఇష్టపడడం లేదు. కళ్యాణ్‌రామ్‌కి బాలకృష్ణ అండదండలు లేకపోయినా ఎన్టీఆర్‌ క్లోజ్‌ అయ్యాడు కనుక ఇక హ్యాపీగా ఉండొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు