చ‌ర‌ణ్ `గోవిండుడు..` ఆగిపోయాడు!

చ‌ర‌ణ్ `గోవిండుడు..` ఆగిపోయాడు!

నిన్న మొన్నటిదాకా య‌మా జోరు మీద క‌నిపించాడు రామ్‌చ‌ర‌ణ్‌. విరామం లేకుండా షూటింగ్ చేశాడు. నిన్న కూడా సెట్‌లో విల‌న్లతో ఫైట్లు చేశాడు. ఒంటి చేత్తో అంద‌రినీ చీల్చి చెండాడాడు.   ఇంత‌లో ఏమైందో ఏంటో కానీ... ఉన్నట్టుండి చెర్రీ  అస్వస్థత‌కి గుర‌య్యాడు. తీవ్ర జ్వరంతో ఆయ‌న ఇప్పుడు ఇంట్లోనే రెస్ట్ తీసుకొంటున్నారు. దీంతో చ‌ర‌ణ్ కథానాయకుడిగా నటిస్తున్న `గోవిందుడు అంద‌రివాడేలే` సినిమా ఆగిపోయింది. చ‌ర‌ణ్ కోలుకొనే వ‌ర‌కు సినిమా ముందుకు క‌దిలే ఛాన్సే లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం చ‌ర‌ణ్‌పైనే కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఆయ‌న కోలుకొనేవ‌ర‌కు సినిమా ఆపేయాల‌ని చిత్రబృందం నిర్ణయించింది. ఆ విష‌యం గురించి చ‌ర‌ణ్ కూడా ట్వీట్ చేశాడు. ``గోవిందుడు అంద‌రివాడేలే ఆగిపోవ‌డం బాధ‌గా ఉంది. తీవ్ర జ్వరంగా ఉంది. వీలైనంత త్వర‌గా  కోలుకొని మ‌ళ్లీ సెట్‌లోకి అడుగు పెడ‌తా`` అని ట్వీట్ చేశాడు చెర్రీ.  ఆయ‌న స‌ర‌స‌న సినిమాలో కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. కృష్ణవంశీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English