అనామిక పోయినా.. వీళ్లు తగ్గట్లేదు

అనామిక పోయినా.. వీళ్లు తగ్గట్లేదు

హిందీ సినిమాల రీమేక్‌లు తెలుగులో అంతగా ఆడవు. ఎప్పుడో ఒక శంకర్‌దాదా ఎంబిబిఎస్‌, గబ్బర్‌సింగ్‌ లాంటివి మినహా హిందీ రీమేక్స్‌ ఈమధ్య అయితే పెద్దగా ఆడడం లేదు. హిందీ చిత్రాలని యూత్‌తో పాటు సిటీ ఆడియన్స్‌ బాగానే కవర్‌ చేసేస్తారు. దీంతో ఫలానా పాపులర్‌ సినిమాకి రీమేక్‌ అని చెబితే ప్రేక్షకులకి పెద్దగా ఆసక్తి ఉండదు. రీసెంట్‌గా అనామిక చిత్రం దానికి సాక్ష్యం. కహానీ చిత్రాన్ని శేఖర్‌ కమ్ముల కష్టపడి రీమేక్‌ చేస్తే జనం దీనిని పట్టించుకోవడం లేదు.

అసలే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా అవడంతో దీనిని తెలుగు, తమిళంలో కూడా నిరాకరించారు. ఫలితంగా నిర్మాతలు భారీగా నష్టపోయే పరిస్థితి తలెత్తింది. అయితే ఈ పరాజయాన్ని పట్టించుకోకుండా క్వీన్‌ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కంగన రనౌత్‌ నటించిన ఈ చిత్రం హిందీలో యాభై కోట్లకి పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించింది. దీనిని దక్షిణాదిలో కూడా ఆదరిస్తారని భావిస్తూ తెలుగు, తమిళంలో ఒకేసారి రీమేక్‌ చేయడానికి తగిన హీరోయిన్‌ కోసం చూస్తున్నారు. ఈ చిత్రం చేయడానికి సమంత ఆసక్తి చూపించింది కానీ ప్రస్తుతం ఆమెకి ఉన్న బిజీ షెడ్యూల్స్‌ మధ్య దీనికి డేట్స్‌ ఇచ్చే ఛాన్స్‌ లేదు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English