రాజకీయం వైపు ప్రభాస్‌ అడుగులు

రాజకీయం వైపు ప్రభాస్‌ అడుగులు

ఎన్టీఆర్‌, బన్ని చరణ్‌,..అంతా ఓ ఇంటివాళ్లయిపోయారు. ఈ వరుసలోనే ప్రభాస్‌ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని చెప్పేశాడు. అయితే తను పెళ్లాడబోయేది ఓ రాజకీయ కుటుంబంలోని అమ్మాయినా? అనేది ప్రస్తుతం జనాల్లో నడుస్తున్న చర్చ. నార్నే కుటుంబం నుంచి లక్ష్మీప్రణతిని ఎన్టీఆర్‌ పెళ్లాడాడు. ‘అపోలో’ ఉపాసన కామినేనిని రావ్‌ుచరణ్‌ పెళ్లాడాడు. అలాగే ఓ ఐటీ ఇండస్ట్రీ, ఎడ్యుకేషనల్‌ సంస్థల నేపథ్యంలోని అమ్మాయి స్నేహారెడ్డిని బన్ని వివాహమాడాడు.

ఈ ముగ్గురూ బిజినెస్‌ బ్యాగ్రౌండ్‌ ఉన్నవాళ్లనే పెళ్లాడారు. ఎందుకంటే సొంత ఫ్యామిలీల్లో రాజకీయంగా అండదండలున్నాయి కాబట్టి, బిజినెస్‌ ఫ్యామిలీస్‌ నుండి అమ్మాయిలను ఎంపిక చేసుకున్నారు. వాళ్లతో పోల్చి చూస్తే ప్రభాస్‌కి రాజకీయ నేపథ్యంగానీ, పరిశ్రమల నేపథ్యంగానీ లేవు. సరిగ్గా  ఇదే కారణం వల్ల తనకీ ఓ అండ కావాలని ప్రభాస్‌ భావిస్తున్నాడట. అందుకోసం ఖచ్ఛితంగా రాజకీయనేత కూతురునే పెళ్లాడాలనుకుంటున్నాడట. అందుకు పెదనాన్న కృష్ణంరాజు పావులు కదుపుతున్నారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు