టైటిల్స్‌ మారాయ్‌.. కథలు మారతాయ్‌

 టైటిల్స్‌ మారాయ్‌.. కథలు మారతాయ్‌

భారతదేశంలో సినిమా ప్రస్థానం బిగినయ్యి వందేళ్ళు గడుస్తోంది. అయితే తెలుగు సినిమా ఈ టైములో ఎలా ఉందో చూడండంటూ విమర్శకులు తమ బాణాలను సంధించారు.  కేవలం ఫార్ములా కథలూ, మూస పాటలు, హీరోయిన్ల అందాలు,  హీరోల బిల్డప్‌ డైలాగులు తప్పిస్తే సినిమాల్లో ఏమీ ఉండటంలేదని వీరు అందరికీ తెలిసిన విషయాన్నే కొత్తగా మళ్ళీ చెప్పారు.
             ఇదే విషయంపై దర్శకుడు-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ, ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలు పరిణితి చెందుతున్నాయని, మూస కథలకు ముగింపు పలికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు. ''ప్రస్తుతం ఇంగ్లీషు టైటిల్‌, లేకపోతే బూతు పేర్లు పెట్టకుండా మనోళ్ళు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు... గుండెజారి గల్లంతయ్యిందే.. వంటి అచ్చ తెలుగు పేర్లనే వాడుతున్నారు.
         ఇప్పుడే టైటిల్స్‌ మారాయ్‌, త్వరలోనే కథలు కూడా మారతాయ్‌'' అంటూ ముగించారు తమ్మారెడ్డి. చూద్దాం అలా జరిగితే తెలుగు సినిమా స్థాయి కూడా ప్రపంచం గర్వించదగ్గా రీతిలో పెరుగుతంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు