ప్రకాష్‌రాజ్‌పై సీరియస్‌ యాక్షన్‌

ప్రకాష్‌రాజ్‌పై సీరియస్‌ యాక్షన్‌

 'ఆగడు' సినిమా నుంచి ప్రకాష్‌రాజ్‌ని తప్పించి సోనూ సూద్‌ని తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రకాష్‌రాజ్‌ మాత్రం తానే ఆ సినిమా నుంచి తప్పుకున్నానని చెబుతున్నాడు. కానీ ఈ వ్యవహారం వెనుక ఇంకా చాలా జరిగిందనే సంగతి ఆలస్యంగా బయటకి వచ్చింది. ఆగడు సినిమా కో డైరెక్టర్‌ని అసభ్య పదజాలంతో అవమాన పరిచాడట ప్రకాష్‌రాజ్‌. అతను దీనిని తేలిగ్గా తీసుకోవడం లేదు. ప్రకాష్‌రాజ్‌పై సాక్ష్యాలతో సహా అతను డైరెక్టర్స్‌ అసోసియేషన్‌కి కంప్లయింట్‌ ఇచ్చాడు. దీంతో మొత్తం అసోసియేషన్‌ సభ్యులందరినీ పిలిచి ప్రకాష్‌రాజ్‌పై సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాలని అసోసియేషన్‌ నిర్ణయించింది.

ఇప్పటికే అవకాశాలు తగ్గిపోయిన ప్రకాష్‌రాజ్‌ దీని తర్వాత తెలుగులో మళ్లీ కనిపించకపోయినా ఆశ్చర్యం లేదు. ప్రకాష్‌రాజ్‌పై ఇలాంటి కంప్లయింట్స్‌ కొత్తేమీ కాదు. అయితే సాటి వారికి గౌరవం ఇవ్వకుండా మాట్లాడ్డమనేది మాత్రం మొదటి సారి వింటున్నాం. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా చేసి ఉన్నాడేమో తెలీదు కానీ ఇప్పుడైతే ఇది సీరియస్‌ ఇష్యూ అయింది. మరి ప్రకాష్‌రాజ్‌ వివరణ ఏమిటో వినాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు