మెగా హీరోలని నమ్ముకున్న మహేష్‌ హీరోయిన్‌

మెగా హీరోలని నమ్ముకున్న మహేష్‌ హీరోయిన్‌

మహేష్‌బాబుతో నటించడానికి స్టార్‌ హీరోయిన్లు పోటీలు పడుతూ ఉంటే లక్కీగా ఒక కొత్త హీరోయిన్‌ అతనితో రొమాన్స్‌ చేసేసింది. అయితే ఆమె లక్‌ అంత వరకే పరిమితం అయింది. 1 నేనొక్కడినేలో మహేష్‌ సరసన నటించాననే తృప్తి మినహా క్రితి సనన్‌కి అవకాశాలేమీ రాలేదు. 1 హిట్‌ అయి ఉంటే ఆమె రేంజే మరోలా ఉండేది. మహేష్‌ హిట్‌ ఇవ్వలేకపోవడంతో ఇప్పుడు క్రితి మెగా హీరోల మీద ఆశలు పెట్టుకుంటోంది.

అల్లు అర్జున్‌ తదుపరి చిత్రంలో క్రితి ఒక కథానాయికగా నటిస్తుందని వినిపిస్తోంది. చరణ్‌తో శ్రీను వైట్ల తీసే సినిమాలో కూడా క్రితి హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ ఉందని అంటున్నారు. ఈ రెండు సినిమాలు దక్కించుకున్నట్టయితే క్రితి మరోసారి టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. మెగా హీరోలతో నటించిన తర్వాత తమన్నా, కాజల్‌, శృతిహాసన్‌ కెరీర్స్‌ టర్న్‌ అయ్యాయి. వాళ్లంతా ఆ తర్వాత పెద్ద స్టార్లు అయిపోయారు. మళ్లీ మెగా హీరోలు క్రితికి కూడా కలిసొచ్చి ఆమెని కూడా స్టార్‌ని చేసేస్తారేమో చూడాలి. ఈలోగా క్రితి బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటుంది. అక్కడ ఆమెకి ఎలాంటి ఫలితం ఎదురవుతుందనే దాన్ని బట్టి ఈ పొడుగు కాళ్ల సుందరి భవిష్యత్తు తెలుగులోనా లేక హిందీలోనా అనేది ఆధారపడి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు