రాంగ్‌ స్టెప్పేసిన రాజశేఖర్‌

 రాంగ్‌ స్టెప్పేసిన రాజశేఖర్‌

రాజశేఖర్‌కి చాలా కాలంగా హిట్లు లేవు. సొంతంగా తన సినిమాలు తనే తీసుకుని చేతులు కాల్చుకున్నాడు. షూటింగ్స్‌కి టైమ్‌కి రాడనే బ్యాడ్‌ నేమ్‌ ఉండడంతో అతనికి అవకాశాలు కూడా ఎవరూ ఇవ్వడం లేదు. ఇలాంటి టైమ్‌లో అతనికి రాంగోపాల్‌వర్మ సినిమాలో నటించే అవకాశం వస్తే కాదనకుండా చేసేసాడు. పట్టపగలు అనే సినిమాలో రాజశేఖర్‌ హీరోయిన్‌ తండ్రిగా నటించాడు. ఇంత కాలం హీరో పాత్రలే చేస్తానంటూ భీష్మించుకుని కూర్చున్న రాజశేఖర్‌ సడన్‌గా తండ్రి పాత్ర చేయడానికి సరే అన్నాడు. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేయడానికి తాను రెడీగా ఉన్నానని చాటుకోవడానికి రాజశేఖర్‌ ఈ స్టెప్‌ వేసినట్టున్నాడు.

అయితే రాజశేఖర్‌ ఇలాంటి సినిమా కాకుండా లెజెండ్‌లాంటి సినిమాని ఎంచుకుని డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేసి ఉంటే అతనికి హెల్ప్‌ అయి ఉండేది. జగపతిబాబు కెరీర్‌ ఇప్పుడు ఊపందుకోవడమే కాకుండా అతనికి రెండు కోట్ల పారితోషికం కూడా ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. రాజశేఖర్‌ వేసిన ఈ రాంగ్‌ స్టెప్‌ వల్ల అతనికి మళ్లీ బ్రేక్‌ రావడానికి మరి కొన్నాళ్లు వేచి చూడక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు