అక్కినేని హీరో! విలన్‌గా..

అక్కినేని హీరో! విలన్‌గా..

          చేతిలో సినిమాలు లేకపోతే ఏం చేస్తాడు చెప్పండి. కామ్‌గా ఫ్యామిలీ బిజినెస్‌ అయినా చేసుకోవాలి లేకపోతే సినిమాల్లో హీరో వేషాలు కాకుండా వేరేవాటినైనా ఎంచుకోవాలి. ఇప్పుడు అలానే చెయ్యాలని అనుకుంటున్నాడట అక్కినేని హీరో సుమంత్‌. ఒక టైములో వరుసగా సినిమాలు చేసిన సుమంత్‌, ఇప్పుడు సినిమాలు లేకుండా ఖాళీగానే ఉన్నాడు.
             ఒక్క చంద్ర సిద్దార్ద సినిమా 'ఏమో గుర్రం ఎగరావచ్చు' తప్పితే కొత్త సినిమాలే ఏమీ సైన్‌ చెయ్యలేదు. అయితే ఇన్ని రోజులూ హీరోగా చెలరేగిపోయిన సుమంత్‌ ఒక్కసారిగా విలన్‌గా చేద్దామని డిసైడయ్యాడు. పైగా ఎప్పటినుండో నెగెటివ్‌ రోల్స్‌ చేద్దామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఎవ్వరూ మనోడికి ఛాన్స్‌ ఇవ్వడంలేదని వాపోయాడు. అసలు ఇన్ని సంవత్సరాలు హీరోగా చేశావు, ఇప్పుడు పావుగంట స్క్రీన్‌ టైమ్‌ కూడా ఉండని విలన్‌ క్యారెక్టర్‌ ఎలా చేస్తావ్‌ సుమంత్‌?
            అసలు ఈ విషయంపై మామయ్య నాగార్జున ఎలా స్పందిస్తాడో.. ఎందుకంటే మనోడ్ని హీరోగా నిలబెట్టింది, ఇప్పుడు కావాలంటే విలన్‌గా నిలబెట్టేది కూడా కింగ్‌ మాత్రమే!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు