రాజశేఖర్‌కి మోహన్‌బాబు సీనుందా?

రాజశేఖర్‌కి మోహన్‌బాబు సీనుందా?

రాంగోపాల్‌వర్మ 'రౌడీ' సినిమా కోసం 'సర్కార్‌' యథాతథంగా దించేసాడు. వర్మ తన స్థాయి తగ్గిపోయిందనే విషయాన్ని ప్రతి సీన్‌లోను నిరూపించుకున్నాడు. కేవలం మోహన్‌బాబు వల్ల ఈ సినిమాని పూర్తిగా తీసి పారేయడం లేదెవరూ. అయిదు వందలకి పైగా సినిమాల్లో నటించిన అనుభవంతో మోహన్‌బాబు రౌడీని ఒంటి చేత్తో నిలబెట్టారు. అయితే రౌడీ రిలీజ్‌ అయిన వెంటనే వర్మ 'పట్టపగలు' పోస్టర్లు విడుదల చేసాడు. తనకి బాగా ఇష్టమైన హారర్‌ జెనర్‌లో తీసిన ఈ చిత్రం వర్మ గతంలో తీసిన హారర్‌ సినిమాల లుక్‌నే తలపిస్తోంది.

అయితే రాత్రి పూట జరిగే సంఘటనలతో భయపెట్టే హారర్‌ సినిమా కాకుండా ఈసారి పట్టపగలే భయపెట్టే సినిమాని వర్మ తీస్తున్నాడు. ఇందులో రాజశేఖర్‌ హీరోగా నటించడం విశేషం. ఒకప్పుడు చాలా పేరుండి, ప్రస్తుతం సక్సెస్‌లు లేని వారిని ఎంచుకుని మరీ వర్మ ఈ సినిమాలు తీస్తున్నాడు. అయితే రౌడీ సినిమాని డిజాస్టర్‌ కాకుండా కాపాడిన మోహన్‌బాబులా వర్మ పైత్యాన్ని తట్టుకుని పట్టపగలుని నిలబెట్టే సత్తా రాజశేఖర్‌కి ఉందా లేదా అనేది చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు