వ‌ర్మ ఆట‌లు రాజ‌శేఖ‌ర్ ద‌గ్గర సాగ‌లేదా?!

వ‌ర్మ ఆట‌లు రాజ‌శేఖ‌ర్ ద‌గ్గర సాగ‌లేదా?!

మోహ‌న్‌బాబుని ఎవ్వరూ చూపించ‌ని రీతిలో వ‌ర్మ చూపించాడు. విగ్గు ప‌క్కన పెట్టి కెమెరా ముందుకు ర‌మ్మన్నాడు. మోహ‌న్‌బాబు కూడా వ‌ర్మ మాట‌ని జ‌వ దాట‌కుండా విగ్గు లేకుండా కెమెరా ముందుకొచ్చాడు. ఇప్పటిదాకా ఆయ‌న ఏ సినిమాలోనూ అలా విగ్గు లేకుండా న‌టించ‌లేదు. కానీ వ‌ర్మపై న‌మ్మకంతో ఆ ప్రయ‌త్నం చేశాడు. రిజ‌ల్ట్ బాగానే వ‌చ్చింది. `రౌడీ` చూసిన అంద‌రూ... మోహ‌న్‌బాబు క‌నిపించిన విధానం చాలా బాగుంద‌న్నారు.

అయితే... వ‌ర్మ మ‌రో న‌టుడిని కూడా విగ్గు లేకుండా తెర‌పైకి తీసుకొస్తున్నాడ‌ని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఆ న‌టుడు ఎవ‌రంటే... రాజ‌శేఖ‌ర్‌. `ప‌ట్టప‌గ‌లు` పేరుతో రాజశేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా వ‌ర్మ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. హార్రర్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ విగ్గు లేకుండా కనిపిస్తాడని ప్రచారం సాగింది. అయితే వ‌ర్మ చేసిన ఆ ప్రయ‌త్నం ఫ‌లించ‌లేద‌ని స‌మాచారం.

ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాల్లో రాజశేఖ‌ర్ ఎప్పటిలాగే క‌నిపిస్తున్నాడు. కాక‌పోతే.. కాస్త గెడ్డం పెంచాడు. ఈ రోజు ఆ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కాబోతోంది. ఆ చిత్రంతో ఏ స్థాయిలో భ‌య‌పెట్టాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు