రిటైరవ్వడమే బెటరంటారా?

రిటైరవ్వడమే బెటరంటారా?

ఒకప్పుడు టాలీవుడ్‌ టాప్‌ ఫోర్‌గా పిలువబడే ఈ నలుగురు ఇప్పుడు పెద్దగా సినిమాల్లో హడావుడి చెయ్యడంలేదు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున టాలీవుడ్‌కు టాప్‌ ఫోర్‌గా చాలా సంవత్సరాలు జండా ఎగరేశారు. అయితే ఇప్పుడు ఒక్కొక్కరిగా తమ ఇమేజ్‌ను కోల్పోతున్నారేమేనని విమర్శకుల అంచనా.
                     ఇప్పటికే చిరు సినిమాలనుండి తప్పుకోగా, బాలకృష్ణ ఎందుకో సినిమాలను కాస్త స్లో చేశారు. మొన్న రిలీజైన షాడో, నిన్న రిలీజైన గ్రీకువీరుడు యావరేజ్‌గా ఉండటమే కాకుండా, మన హీరోలు యూత్‌పై మ్యాజిక్‌ చేసే సీన్‌ లేదని అర్దమైంది. యంగస్టర్స్‌తో పెద్దగా కనెక్టవ్వడం లేదనేది టాక్‌. ఈ తరుణంలో మనోళ్ళు ఇంకా హీరోలుగా కొనసాగకుండా రిటైర్‌ అయితే బెటరని అనిపిస్తోంది. లేకపోతే వెంకీలాగా ఏవైనా మల్టీస్టారర్‌ సినిమాలు చెయ్యడం కూడా బాగానే ఉంటుంది.
                      మరి ఇన్ని సంవత్సరాలు పాటు జనాలు ఆదరించాలన్నా, ఇవి పాతరోజులు కాదు కాబట్టి అది కష్టమే. చూద్దాం ఏం చేస్తారో...!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు