రామ్ చరణ్ పై కేసు

రామ్ చరణ్ పై కేసు

ఈ హెడ్టింగ్ చూడగానే అల్లపుడెపుడో, సాఫ్ట్ వేర్ కుర్రాళ్లను రామ్ చరణ్, చిరంజీవి రక్షక దళం కొట్టిన వైనం అనుకునేరు. అదేమయిందో అతీగతీ తెలియదు కానీ ఇది వేరే వైనం. ఆ మధ్య రామ్ చరణ్ పుట్టిన రోజు సంబరాలు జరిగాయి. దీనికోసం జూబ్లీహిల్స్ ప్రాంతంలో భారీగా అభిమానులు పోగయ్యారు. మామూలుగా అయితే మన జనాలకు అలవాటే. అడియో ఫంక్షన్లయి, అభిమాన తారల పుట్టిన రోజు అయినా ట్రాఫిక్ జామైపోయి, జనం అగచాట్లు పడడం. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఎన్నికల కోడ్ అమలులో వుంది. మందుగా అనుమతులు గట్రా కావాలి. ఇవేవీ లేకుండా రామ్ చరణ్ బర్త్ డే వ్యవహారం జరగడంతో, పోలీసులు లాంఛనంగా కేసు నమోదు చెసారని వినికిడి. ఫాన్స్ సంఘం నాయకుడు, రామ్ చరణ్ లకు నోటీసుల కూడా ఇచ్చారట,. రోటీన్ వ్యవహారమే అనుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు