డైరెక్టర్‌ కెరీర్‌ కిల్‌ చేస్తున్నారు

డైరెక్టర్‌ కెరీర్‌ కిల్‌ చేస్తున్నారు

టాలెంట్‌ ఉన్న దర్శకులు, కొత్తగా ఆలోచించే దర్శకులు, తెలుగు సినిమాకి కొత్తదనం నేర్పగల నేర్పు ఉన్న దర్శకులు చాలా అరుదుగా వస్తుంటారు. ఎక్కువ శాతం మూస సినిమాలతో సేఫ్‌ రూట్‌లో కోట్లు గడించాలని అనుకుంటారు కానీ నిజంగా ఒక గుర్తుండిపోయే సినిమా తీద్దామని అనుకునే వాళ్లు బాగా తక్కువ. అలా అరుదుగా వచ్చే దర్శకుల్లో ఒకడు దేవా కట్టా. అతను తీసిన ప్రస్థానం గత అయిదారేళ్లలో తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన మర్చిపోలేని సినిమాల్లో ఒకటి. ఆ సినిమాతో అతనికి ఆర్థిక విజయం దక్కలేదు కానీ చాలా మంచి పేరు వచ్చింది. ఆ జోరులోనే ఆటోనగర్‌ సూర్య మొదలు పెట్టాడు. నాగచైతన్యలాంటి నోటెడ్‌ హీరో దొరికే సరికి తనకి కమర్షియల్‌గా కూడా బ్రేక్‌ వస్తుందని అనుకున్నాడు. కానీ అనూహ్యంగా ఆ సినిమా అతని కెరీర్‌కి బ్రేక్‌ వేసేసింది. విడుదల కాకుండా నిలిచిపోయిన ఈ చిత్రం దేవా కట్టాని తీవ్రంగా వేధిస్తోంది. అసలు రిలీజే కాదు అనుకుంటే దానిని వదిలేసి మరో సినిమా తీయడానికి ముందుకు కదలొచ్చు. కానీ ఈ సినిమా రిలీజ్‌ గురించి తరచుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దాంతో దాని ఫలితం చూసి తదుపరి సినిమా చేద్దామని దేవా కట్టా, లేదా అది వచ్చాక ఇతనితో చేయాలో వద్దో డిసైడ్‌ చేసుకుందామని హీరోలు... అనుకుంటూ అతని కెరీర్‌ అనుమానంలో పడిపోయింది. తను చేసిన పొరపాటు ఏమీ లేకపోయినా పాపం అతని కెరీర్‌ ఇలా అయిపోవడం బాధ కలిగిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు