బాల‌య్య కొడుకు లైట్‌మెనా?!

బాల‌య్య కొడుకు లైట్‌మెనా?!

హీరోగారి కొడుకు సెట్‌లోకి అడుగు పెడుతున్నాడంటే... అక్కడ వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి! బాబూ బాబూ... అంటూ ప‌దిమంది వెంట న‌డుస్తుంటారు. ఆ బాబు సెట్‌లోకి రావ‌డ‌మే ఆల‌స్యం... టీ కావాలా?  కాఫీ కావాలా? అంటూ సేవ‌లు చేయ‌డానికి మ‌రో న‌లుగురు అక్కడికి చేర‌తారు. ఆ బాబు ఏం అడిగితే అది క్షణాల్లో తెచ్చిపెడ‌తారు. మొత్తంగా అత‌న్ని ఒక యువ‌రాజులాగా చూసుకొంటుంటారు. కానీ బాల‌కృష్ణ మాత్రం అందుకు భిన్నంగా న‌డుచుకొన్నాడు. తన కొడుకుని సెట్‌లో ఓ బాయ్‌లాగా మార్చేశాడు. చిత్రబృందానికి స్వయానా  కొడుకు చేత‌ టీ ఇప్పించాడు. లైట్‌మెన్‌లా మార్చేశాడు. ట్రాలీ తోయించాడు. `ప‌డిపోతాను డాడీ` అంటే... `ఏం ఫ‌ర్లేదు... దెబ్బలు త‌గిలితే ఏం కాదు, తోసేయ్‌` అన్నాడ‌ట‌ బాల‌య్య. ఆయ‌న కొడుకేమిటీ? ఇన్ని ప‌నులు చేయ‌డ‌మేమిటీ, చేయించ‌డ‌మేమిటీ అంటారా? అదే మ‌రి బాల‌య్య స్పెషాలిటీ అంటే.  రేపో మాపో కాబోయే హీరోనే అయినా... మోక్షజ్ఞకి సెట్‌లో అన్ని విష‌యాలూ తెలియాల‌నేది బాల‌కృష్ణ ఆలోచ‌న‌. టీ అందించే బాయ్ క‌ష్టమేంటి?  లైట్‌మెన్ ఎంత శ్రమిస్తాడు? స‌హాయ ద‌ర్శకుడు ఏమేం ప‌నులు చేస్తాడు? ఇలాంటివ‌న్నీ తెలుసుకొంటేనే బాగుంటుంద‌ని బాల‌కృష్ణ భావించాడ‌ట‌. అందుకే త‌న కొడుకుతో `లెజెండ్‌` చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అన్ని ప‌నులూ చేయించాడ‌ట‌. ఆ విష‌యాన్ని లెజెండ్ ద‌ర్శకుడు బోయ‌పాటి శ్రీను మీడియాతో చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు