ముద్దు సీన్లు ఆంటీకి ఓకెనా?

ముద్దు సీన్లు ఆంటీకి ఓకెనా?

ఓ ముసలాడితో నడివయసు సుందరి రొమాన్సా? అంటూ అప్పట్లో ముక్కున వేలేసుకున్నారంతా. అదేదో..చేయకూడనిది అన్నట్టు విమర్శలూ ఎదరయ్యాయి. ఇదంతా ఇష్కియా సినిమాలో నసీరుద్దీన్‌ షాతో విద్యాబాలన్‌ ఇంటిమేట్‌ సీన్ల గురించే. విద్యా అందాల్ని ఆరాంగా ఆరగించే పాత్రలో నసీరుద్దీన్‌ ఇరగదీశాడు. అదీ చాలదన్నట్టు నడివయసు యువకుడు అర్షద్‌వార్సీతోనూ హాట్‌ హాట్‌ సీన్లలో రెచ్చిపోయింది బాలన్‌.

ఇప్పుడా ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘దేడ్‌ ఇష్కియా’ తెరకెక్కుతోంది. ఈసారి పెళ్లయిన ఆంటీ మాధురిధీక్షిత్‌ వృద్ధ నసీర్‌తో ఆస్థాయిలోనే ఇంటిమేట్‌ సీన్లలో విరుచుకుపడబోతోందిట. దేడ్‌ ఇష్కియా సినిమాలో నసీరుద్దీన్‌, మాధురీ దీక్షిత్‌ అదిరిపోయే రొమాన్స్‌తో కనువిందు చెయ్యనున్నారని బాలీవుడ్‌ జనాలు చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో లిప్‌ లాక్‌లకు ఆంటీ మాధురికి ఓకేనా? పెళ్ళాయక ఇలాంటి సెక్సీ పనులు చెయ్యడానికి అమ్మడు రెడీగా ఉందా? ఒకవేళ తను చేస్తానన్నా అమ్మడి మగడు శ్రీరామ్‌ నీనే ఒప్పుకుంటాడా? అనేది తేలాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు