చ‌ర‌ణ్‌కి `నో` చెప్పిన జ‌గప‌తిబాబు!

చ‌ర‌ణ్‌కి `నో` చెప్పిన జ‌గప‌తిబాబు!

నిన్న మొన్ననే విల‌న్ వేషాల్లోకి మారిపోయాడు జ‌గ‌ప‌తిబాబు. ఆయ‌న తెలుగులో విల‌న్‌గా న‌టించిన తొలి సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు కూడా రాలేదు. అప్పుడే జ‌గ‌ప‌తిబాబు తండ్రి పాత్రలు కూడా ఒప్పుకొంటున్నాడ‌నీ, రామ్‌చ‌ర‌ణ్‌కి తండ్రిగా న‌టిస్తున్నాడ‌ని కొన్ని రోజులుగా ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ప్రచారం సాగుతోంది. కృష్ణవంశీ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న కుటుంబ క‌థ‌లో చెర్రీకి తండ్రిగా జ‌గ‌ప‌తిబాబు న‌టించేందుకు ఒప్పుకొన్నట్టు మీడియాలో కూడా వార్తొల‌చ్చాయి. అయితే.. జ‌గ‌ప‌తి మాత్రం ఆ వార్తల్ని తోసిపుచ్చాడు.  ఇప్పట్లో తండ్రి పాత్రలు చేసే ఉద్దేశం ఏమాత్రం లేద‌ని ఆయ‌న స్పష్టం చేశారు.

నిజానికి కృష్ణవంశీ ద‌గ్గర్నుంచి అందుకు సంబంధించిన ఆఫ‌ర్ వ‌చ్చిన మాట నిజ‌మే కానీ... నేను సున్నితంగా తిర‌స్కరించాన‌ని ఆయ‌న చెప్పారు. తాను ఇంకా క్యారెక్టర్ పాత్రల్లో న‌టించాల్సి ఉంద‌నీ, ఈ ద‌శ‌లో తండ్రి పాత్రల్లోకి మార‌డం స‌బ‌బు కాద‌ని ఆయ‌న అన్నారు. దీంతో చ‌ర‌ణ్ స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. చ‌ర‌ణ్‌కి తండ్రిగా న‌టించేందుకని ఇప్పటికే చాలా మందిని ప‌రిశీలించారు. మ‌రి ఆ అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English