మహేష్‌కి ఆమాత్రం ఉండాలండీ!

మహేష్‌కి ఆమాత్రం ఉండాలండీ!

మహేష్‌బాబు సరసన ఓ త్రిష, ఓ సమంత... ఇలా చాలా తక్కువ మంది మాత్రమే సూట్‌ అయినట్టు అనిపించారు. ఎంతటి అందగత్తెని అయినా డామినేట్‌ చేసేసి తనకి మిస్‌మ్యాచ్‌ అయిందని అనిపించగల మహేష్‌ కోసం ఇప్పుడు కొత్త కొత్త భామల్ని దిగుమతి చేస్తున్నారు. మహేష్‌ పక్కన మెరిసే భామ మినిమమ్‌ బాలీవుడ్‌ రేంజ్‌ ఉండాలని అనుకుంటున్నారు. అందుకే క్రిష్‌ డైరెక్షన్‌లో చేయబోయే 'శివమ్‌' చిత్రంలో సోనాక్షి సిన్హా ఉంటుందని అంటున్నారు.

 మరి అంతకంటే ముందు మొదలయ్యే 'ఆగడు'లో హీరోయిన్‌ ఎవరు? ఇందులో కూడా బాలీవుడ్‌ హీరోయినేనట. ప్రస్తుతం బాలీవుడ్‌ యూత్‌ హార్ట్‌త్రోబ్‌గా పిలిపించుకుంటోన్న పరిణీతి చోప్రా ఈ చిత్రంలో నటించనుందని టాక్‌ వినిపిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జులైలో స్టార్ట్‌ అవుతుంది. వచ్చే వేసవిలో విడుదలకి ప్లాన్‌ చేస్తున్న ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు. మహేష్‌తో నటించే లక్‌ పరిణీతి సొంతం చేసుకుందో లేదో తెలుసుకోవడానికి అధికారికంగా అనౌన్స్‌ చేసే వరకు వేచి ఉందాం.  


 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు