ఆ సూపర్‌హిట్‌ ఐడియా ఆయన్దేనట

ఆ సూపర్‌హిట్‌ ఐడియా ఆయన్దేనట

'గుండె జారి గల్లతయ్యిందే' సినిమా ఇప్పుడు బ్రహ్మాండంగా ఆడేస్తోంది. నితిన్‌కి ఇష్క్‌ తర్వాత ఇంకో సూపర్‌హిట్‌ ఈ చిత్రంతో దక్కింది. ఈ సినిమా విజయంలో 'తొలిప్రేమ'లోని 'ఏమయిందో ఈవేళ' సాంగ్‌ రీమిక్స్‌ కీలక పాత్ర పోషించింది. ముందుగా ఈ పాట రీమిక్స్‌ చేయాలని అనుకోలేదట. అయితే మూడు రోజుల్లో హీరోయిన్‌ తనకి ఒక స్వీట్‌ న్యూస్‌ చెబుతానని హీరోతో అనే దగ్గర ఈ పాట పెడితే బాగుంటుందని నితిన్‌ తండ్రి సుధాకర్‌రెడ్డి సూచించారట. ఆ పాట 'అన్‌ దోస్‌ త్రేస్‌' అనే పదాలతో మొదలవుతుంది కాబట్టి ఐడియా బాగుందని వెంటనే రీమిక్స్‌ చేసేశారట. తొలిప్రేమ చిత్రాన్ని నైజాం ఏరియాలో పంపిణీ చేసింది సుధాకర్‌ రెడ్డి. ఆ సినిమా చూశాకే పవన్‌కళ్యాణ్‌కి నితిన్‌ వీరాభిమాని అయిపోయాడు. అలా తన తండ్రి ఇచ్చిన సూచనతో ఈ పాట పెట్టుకుని సూపర్‌హిట్‌ కొట్టానని, తనకి పవన్‌కళ్యాణ్‌ అదృష్టంగా మారిపోయాడని నితిన్‌ ఉప్పొంగిపోతున్నాడు. ఇష్క్‌ సినిమా హిట్‌ అవడానికి కూడా కారణం పవనే అని నితిన్‌ అంటున్నాడు. ఆ సినిమా ఆడియో రిలీజ్‌కి పవన్‌ రావడం వల్ల సినిమా విడుదలకి ముందు మంచి క్రేజ్‌ వచ్చిందని నితిన్‌ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు