సునీల్‌ని చూసి వాత పెట్టుకుంటున్నాడు

సునీల్‌ని చూసి వాత పెట్టుకుంటున్నాడు

 కమెడియన్‌గా స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న సునీల్‌ ఇప్పుడు హీరోగా మారి కోట్లు గడిస్తున్నాడు. అతని సినిమాలకి ప్రేక్షకాదరణ బాగుండడంతో నిర్మాతలు సునీల్‌ కోసం క్యూ కడుతున్నారు. కమెడియన్‌గా ఉన్నప్పుడు లావుగా ఉండడానికే ఇష్టపడిన సునీల్‌ హీరో అయ్యాక సన్నబడి సిక్స్‌ ప్యాక్‌ కూడా సాధించాడు.

సునీల్‌ని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు తమిళ స్టార్‌ కమెడియన్‌ సంతానం కూడా హీరో అవుతున్నాడు. అతను కూడా హీరోగా మెప్పించేందుకోసం బరువు తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడు సంతానంకి తమిళంలో ఎంత క్రేజ్‌ ఉందంటే ఎంత పెద్ద స్టార్‌ హీరో సినిమా అయినా అతను తప్పకుండా ఉండాల్సిందే. పోస్టర్‌ మీద అతను కనిపిస్తే హీరో ఎవరనేది కూడా పట్టించుకోవట్లేదు తమిళ జనం. అంత క్రేజ్‌ ఉన్న సంతానం ఇప్పుడు హీరో అయిపోయి ఇంకా ఎక్కువ సంపాదించాలని చూస్తున్నాడు.

అయితే ఈ వాతలు ఎవర్నో చూసి పెట్టుకోవడం తగదు. ఎందుకంటే అందరు కమెడియన్లు హీరోలుగా సక్సెస్‌ కాలేదు. స్టార్‌ కమెడియన్‌ వడివేలు హీరో వేషాలేసి తర్వాత సినిమాలే లేకుండా మిగిలిపోయాడు. సునీల్‌ని మాత్రమే కాకుండా ఇలాంటి వారిని చూసి కూడా నేర్చుకోవాలి మరి.