చెర్రీ లుక్ అదిరిపోయింద‌ట‌!

చెర్రీ లుక్ అదిరిపోయింద‌ట‌!

కృష్ణవంశీ చేతిలో ప‌డ్డాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఇక అస‌లు సిస‌లైన న‌టుడిని చూడొచ్చు అంటున్నారు సినీ జ‌నాలు.  అభిమానులు కూడా ఆ చిత్రం గురించి ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పొలాచ్చిలో రామ్‌చ‌ర‌ణ్‌, కాజ‌ల్‌ల‌పై ఓ డ్యూయెట్‌ని తెర‌కెక్కిస్తున్నారు.

చెర్రీ పుట్టిన‌రోజైన మార్చి 27న  ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేయ‌బోతున్నారు. అందుకోసం చిత్రబృందం క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టిన‌ట్టు స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్ ఎడ్ల బండిపైన నిలుచున్న స్టిల్‌ని విడుద‌ల చేయ‌బోతున్నట్టు తెలిసింది. ప‌ల్లెటూరి గెట‌ప్‌లో క‌నిపించ‌బోయే ఆ లుక్ అదిరిపోయింద‌ట‌. ప‌నిలో ప‌నిగా టీజ‌ర్‌ని కూడా విడుద‌ల చేయాల‌నుకొన్నా... ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అది సాధ్యం అయ్యేలా లేద‌ని, ఇంకోసారి విడుదల చేద్దామ‌ని కృష్ణవంశీ చెబుతున్నాడ‌ట‌.

కానీ అభిమానులు మాత్రం టీజ‌ర్‌కూడా చూపించండ‌ని అంటున్నారట‌. మ‌రి చిత్రబృందం ఏం చేస్తుంద‌న్నది చూడాలి. చెర్రీ పూర్తిస్థాయిలో ఓ కుటుంబ క‌థ‌లో న‌టించ‌డం ఇదే తొలిసారి. ఇందులో శ్రీకాంత్‌, క‌మ‌లినీ ముఖ‌ర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోవిందుడు అంద‌రివాడు అనే పేరే ఖ‌రారు చేసే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English