డైరెక్టర్లపై ఫైర్‌ అవుతున్న శ్రియ

డైరెక్టర్లపై ఫైర్‌ అవుతున్న శ్రియ

గతంలో తనకి యాక్టింగ్‌ అంటే అస్సలు తెలిసేది కాదని, చాలా సినిమాల్లో దారుణంగా నటించానని, అయినా కానీ అప్పుడు తనని మోసేవారని, నటన తెలియక పోయినా ఆఫర్లతో వెంట పడేవారని శ్రియ అంటోంది. అదే ఇప్పుడు గ్లిజరిన్‌ లేకుండా కన్నీళ్లు పెట్టుకోగలనని, నటిగా చాలా చాలా ఇంప్రూవ్‌ అయ్యానని, ఎలాంటి ఎమోషన్‌ని అయినా పండించే సత్తా తనకి ఉందని, కానీ ఇప్పుడు తన టాలెంట్‌ని వాడుకునే వాళ్లు కనిపించడం లేదని ఆమె బాధ పడుతోంది.

దర్శకులు ఎంత సేపు హీరోయిన్ల అందాలని చూపించడానికే ఇష్టపడతారని, వారికి ఎంత టాలెంట్‌ ఉందనేది గమనించరని, నటించగలదా లేదా అని చూసే డైరెక్టర్లు కరవైపోయారని, కేవలం పాతికేళ్ల వయసులో ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారని ఘాటుగా విమర్శించింది. హాలీవుడ్‌లో నలభై ఏళ్లు దాటిన హీరోయిన్లకి అవకాశాలిస్తారని, బాలీవుడ్‌లో ముప్పయ్‌ దాటిన వారు చాలా మంది ఉన్నారని... కానీ సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆర్టిస్ట్‌ నిజంగా మెచ్యూర్‌ అయ్యే టైమ్‌కి పక్కన పడేస్తున్నారని వాపోయింది.

 ప్రస్తుతం నాగార్జునతో మనంలో తప్ప మరెందులోను ఆమె నటించడం లేదు. అవకాశాలు రావడం లేదనే ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నా కానీ ఆమె మాటలు అక్షర సత్యాలనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు