చ‌ర‌ణ్ లుక్ ఎలా ఉంటుందో?

చ‌ర‌ణ్ లుక్ ఎలా ఉంటుందో?

చాలా రోజులుగా రామ్‌చ‌ర‌ణ్ యాక్షన్‌, హీరోయిజం... ద‌ట్టించిన మాస్ క‌థ‌ల‌తోనే ప్రయాణం చేస్తున్నారు. `ఆరెంజ్‌` స‌రైన ఫ‌లితం ఇవ్వక‌పోవ‌డంతో ఆయ‌న మ‌ళ్లీ ప్రయోగాలవైపు దృష్టిపెట్టలేదు. క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌కే ప్రాధాన్యమిస్తూ ముందడుగు వేశాడు. కృష్ణవంశీతో జ‌త‌క‌లిశాక మాత్రం మ‌రోసారి ధైర్యం చేస్తున్నాడు. కృష్ణవంశీ ద‌ర్శక‌త్వంలో ఫ‌క్తు కుటుంబ క‌థా చిత్రం చేస్తున్నాడు చ‌ర‌ణ్‌. చాలా రోజులు త‌ర్వాత వేసిన  కొత్త అడుగు ఎలాంటి ఫ‌లితం ఇస్తుందో అని అటు మెగా అభిమానులు, ఇటు ప‌రిశ్రమ వ‌ర్గాలు ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నాయి.

సినిమా ఫ్లేవ‌ర్ ఎలా ఉంటుందో ఫ‌స్ట్‌లుక్‌లోనే తెలిసిపోతుంది. చ‌ర‌ణ్ పుట్టిన‌రోజును పుర‌స్కరించుకొని ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 27న చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు. అదే రోజే కృష్ణవంశీ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేస్తున్నార‌ని ప్రచారం సాగుతోంది. సినిమా పేరును కూడా అదే రోజే ప్రక‌టిస్తార‌ట‌. తొలుత ‘గోవిందుడు అంద‌రివాడేలే’ అన్న టైటిల్ అనుకొన్నారు. అయితే ఇప్పుడు ఆ స్థానంలో కొత్త పేరు అన్వేషిస్తున్నారు.  తెలుగు పేరే పెడ‌తార‌ని స‌మాచారం. చిరంజీవి  న‌టించిన సినిమాల  పేర్లు కూడా కొన్ని ప‌రిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English