ఆ సినిమాపై 22 కోట్లు రిస్క్ చేస్తున్నారు!

ఆ సినిమాపై 22 కోట్లు రిస్క్ చేస్తున్నారు!

మైత్రి మూవీ మేకర్స్ పెద్ద హీరోలతో తీసిన సినిమాలకు కూడా అంత కాన్ఫిడెంట్ గా కనిపించరు. పెద్ద హిట్లు కొట్టిన ఈ సంస్థ నుంచి రంగస్థలం తర్వాత మళ్ళీ మంచి హిట్ రాలేదు. ఈ నేపథ్యంలో వారికి ఉప్పెన సినిమాపై మాత్రం మస్తు నమ్మకం ఉంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ తేజ్ హీరోగా రూపొందిన ఉప్పెనపై సోషల్ మీడియాలో మంచి బజ్ ఉంది. పాటలు కూడా పాపులర్ అయ్యాయి.

ఈ చిత్రంపై 22 కోట్లు ఖర్చు పెట్టేసారు. కొత్త వాళ్ళతో తీసిన ఈ సినిమాకి నిర్మాతలు చెప్పిన రేట్ ఇవ్వడానికి ఎవరూ ముందుకి రాలేదు. డిజిటల్ రైట్స్ కూడా ఆశించినంత పలకడం లేదు. అందుకే దీన్ని అమ్మకుండా స్వయంగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

డిజిటల్ రైట్స్ కూడా సినిమా రిలీజ్ అయి హిట్ అయ్యాక అమ్మాలని అనుకుంటున్నారు. రూపాయి కూడా రాబట్టకుండా పూర్తిగా 22 కోట్లకు రిస్క్ చేస్తున్నారంటే ఈ సినిమాపై వాళ్ళ నమ్మకం ఎంత రేంజ్ లో ఉందొ మీరే అర్ధం చేసుకోండిక!

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English