ఆమె టాలెంట్ కి ఫిదా అయిన మహేష్ బాబు!

ఆమె టాలెంట్ కి ఫిదా అయిన మహేష్ బాబు!

మహేష్ తదుపరి చిత్రం పరశురామ్ డైరెక్షన్లో అనేది ఖరారయింది. నిర్మాత ఎవరనే తకరారు ఇంకా కొనసాగుతోంది. ఒకవేళ ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పదం కుదరకపోతే మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి ఆ చిత్రం నిర్మిస్తారు. కరోనా బ్రేక్ వల్ల ఇప్పట్లో షూటింగ్స్ ఉండవు కనుక మహేష్ కూడా రిలాక్స్ మోడ్ లో ఉన్నాడు.

ఇకపోతే ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరు? కీర్తి సురేష్ పేరుని మహేష్ సజెస్ట్ చేసాడట. మహానటి చుసిన దగ్గర్నుంచి మహేష్ కి ఆమెతో కలిసి చేద్దామని ఉందట. కానీ మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాల్లో హీరోయిన్ క్యారెక్టర్ చాలా మాములుగా ఉంటుంది కనుక ఆమెని కన్సిడర్ చేయలేదు.

పరశురామ్ కథలో హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉందనిపించి ఆమెను కాంటాక్ట్ చేయమన్నాడట. కీర్తి సురేష్ కి వేరే సినిమాలతో క్లాష్ ఏమి లేకపోతే మహేష్ తో ఆమెని జోడీగా చూడవచ్చు. పవన్ తో ఆమెకి కలిసి రాలేదు కానీ సూపర్ స్టార్ తో నటిస్తే హిట్ పడుతుందేమో.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English