ఆ పేరు వెనక రాజమౌళి ఐడియా అదే!

ఆ పేరు వెనక రాజమౌళి ఐడియా అదే!

ట్రిపుల్ ఆర్ సినిమాకి టైటిల్ అనౌన్స్ చేస్తున్నారంటే ఇక దానికో పిలుచుకోదగ్గ పేరు ఉంటుందని అనుకున్నారు. కానీ రాజమౌళి ఆ మూడు ఆర్ లకి అర్ధమేంటో చెప్పాడు కానీ టైటిల్ లాంటిది చెప్పలేదు. నిజానికి ఈ మూడు ఆర్ లకి సూట్ అయ్యేలా జనం 'రఘుపతి రాఘవ రాజారామ్' లాంటి పేర్లు సూచించారు.

అయితే ఈ చిత్రాన్ని అందరు ఆర్.ఆర్.ఆర్ గానే పిలవాలి అనేది రాజమౌళి ఉద్దేశం. అందుకే దీనికి సంప్రదాయబద్ధమైన పేరేమి పెట్టలేదు. అన్ని భాషలలోను కేవలం ఈ మూడు ఆర్ లు దేనికి సంకేతం అనేది మాత్రం చెప్పి ఊరుకున్నాడు. హిందీలో అయితే రైజ్ రోర్ రివోల్ట్ అని పేరు పెట్టాడు.

తెలుగులో రౌద్రం రణం రుధిరం అన్నాడు. ఇలా ఈ సినిమాని ఎవరు సంబోధించరు కనుక ట్రిపుల్ ఆర్ పేరు అలానే చలామణీలో ఉంటుంది. రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ కి సింబాలిక్ గా అనుకున్న ట్రిపుల్ ఆర్ ఎప్పటికీ అలాగే నిలిచిపోతుందన్న మాట.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English