కరోనా కల్లోలం మధ్య షూటింగ్ చేస్తున్న హీరో!

కరోనా కల్లోలం మధ్య షూటింగ్ చేస్తున్న హీరో!

మలయాళ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ హీరోగా బ్లేస్సీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆడు జీవితం అనే చిత్రం షూటింగ్ మాత్రం జోర్డాన్ లో జరుగుతోంది. ఇండియాలోని సినిమా షూటింగ్స్ అన్ని ఆగిపోగా, విదేశాల్లో పెట్టుకున్న షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారు.

కానీ ఈ ఒక్క మలయాళ చిత్రం మాత్రం ఇంకా షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడి పరిస్థితులు బాలేదని వీరిని షూటింగ్ ఆపేయమన్నారు. కానీ ఏవో రికమండేషన్లతో రిస్క్ చేసి షూట్ కానిచ్చేస్తున్నారు. ఈ యూనిట్ లో 57 మంది ఉన్నారు.

ఒకసారి షూటింగ్ ఆగిపోయి వెనక్కి వచ్చేస్తే మళ్ళీ అంట మందిని తీసుకెళ్లడం నిర్మాతకి భారం అవుతుంది. అందుకే హీరో సహకరించడంతో షూటింగ్ చేస్తున్నారు. ఈ సంగతి తెలిసిన దగ్గర్నుంచి పృధ్వి ఫాన్స్ కంగారు పడుతున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English