విమర్శలు వచ్చాక కానీ.. బన్నీ స్పందించలేదు

విమర్శలు వచ్చాక కానీ.. బన్నీ స్పందించలేదు

అల్లు అర్జున్ ఈ మధ్య సొంత ఇమేజ్ కోసం ఎంతగా తపన పడిపోతున్నాడో చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందులా అతను ‘మెగా’ పదాన్ని పెద్దగా ఉపయోగించడం లేదు. తన ‘ఆర్మీ’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తన్నాడు. తనపై మెగా ముద్ర లేకుండా చూసుకోవడానికి అతను గట్టిగా ప్రయత్నిస్తున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది.

కొన్నిసార్లు మెగాస్టార్ చిరంజీవి మీద తన ప్రేమను చాటుకుంటున్నా.. కొన్నిసార్లు మాత్రం ఆయన్ని విస్మరిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా గురించి అప్పట్లో అసలు స్పందించకపోవడం.. తనపై విమర్శలు వచ్చాక కానీ రెస్పాండవకపోవడం చర్చనీయాంశమైంది.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లోకి అడుగు పెడితే.. తొలి రోజు సినీ ప్రముఖులంతా ఆయనకు విషెస్ చెబుతూ వెల్కం చెబితే అల్లు అర్జున్ పత్తా లేకుండా పోయాడు. దీని మీద మీడియాలో వార్తలొచ్చాక.. ట్విట్టర్లో జనాలు దెప్పి పొడిచాక తర్వాతి రోజు మధ్యాహ్నానికి బన్నీ లాంఛనం ముగించాడు.

చిరుకు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నానని.. దీని కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నానని చెప్పాడు బన్నీ. ఇదిలా ఉంటే.. కరోనా మీద పోరాటం కోసం సినీ ప్రముఖులు గురువారం పెద్ద ఎత్తున స్పందించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు.

ఇక పెద్ద స్టార్లలో స్పందించాల్సింది బన్నీనే. దీని మీద కూడా అతడిపై పంచులు మొదలయ్యాయి. మరి దీనిపై బన్నీ ఎప్పుడు స్పందించి తన వంతు విరాళం ప్రకటిస్తాడో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English