వాటిని చూసి అనుపమకు కోపమొచ్చింది

వాటిని చూసి అనుపమకు కోపమొచ్చింది

కరోనా కారణంగా దేశ జనమంతా ఇళ్లకే పరిమితమైంది. బయటికి వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని డాక్టర్లు, ప్రభుత్వం చెబుతుండడంతో మార్కెట్లో వాటికి మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. అయితే చాలామంది మాస్కులను వాడిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఇలా రోడ్లపై పడిన మాస్కులను చూసి హీరోయిన్ అనుపమకు బాగా కోపం వచ్చిందట.

రోడ్లపై పడిన మాస్కుల ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన అనుపమ... ‘ఇది చూడడానికి ఏమైనా బాగుందా? కేవలం 500 మీటర్ల దూరంలో ఇన్ని మాస్కులను ఇలా రోడ్లపై పడేశారు. ఇలాగేనా మనం కరోనాపై పోరాడేది? దయచేసి ఇలా చేయకండి... చెత్తబుట్టలు ఎందుకున్నాయి? ఎవరైనా ఇలా రోడ్డుపైన పడేసిన మాస్కులను చూస్తే, ఫ్రీగా వచ్చాయి కదా! అని వాటిని మళ్లీ వాడకండి. చేతులకు గ్లవ్స్ లేకుండా వాటిని ముట్టుకోకండి’ అంటూ రాసుకొచ్చింది.

అత్యవసర విధులకు వెళ్తున్న ఓ డాక్టర్ ఫ్రెండ్, ఈ ఫోటోలను తనకు పంపిందని కూడా చెప్పుకొచ్చింది అనుపమ. అనూ పాపకు కోపం రావడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఆగస్టు 15న జెండా వందనం అయిపోయిన తర్వాత జాతీయ జెండాలనే రోడ్డు మీద పడేసే ఈ జనాలకి, ఎంత చెబితే మాత్రం బుద్ధి వస్తుందా? అని కామెంట్స్ చేస్తున్నారు చాలామంది నెటిజన్స్.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English