ఆర్ఆర్ఆర్ టీమ్‌ని ఎక్సైట్ చేసిన చిరు

ఆర్ఆర్ఆర్ టీమ్‌ని ఎక్సైట్ చేసిన చిరు

ఉగాది రోజున సోషల్ మీడియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్... ఆర్ఆర్ఆర్ టీమ్ విడుదల చేసిన మోక్షన్ పోస్టర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఆర్ఆర్ఆర్ మోక్షన్ పోస్టర్ కన్నుల పండుగగా ఉందని, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన కీరవాణిని, దర్శకుడు రాజమౌళి... హీరోలు తారక్, రామ్‌చరణ్‌లను ప్రశంసించారు.

సోషల్ మీడియాలో ఎంట్రీ ఇస్తూనే  మెగాస్టార్, తమ సినిమాను ఇంతలా మెచ్చుకోవడంతో ఆర్ఆర్ఆర్ టీమ్ ఆనందానికి అవదులు లేవు.. ముందు దర్శకుడు రాజమౌళి, చిరూకు కృతజ్ఞతలు తెలపగా... ఆ తర్వాత తారక్, మెగాస్టార్‌కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు. ‘ట్విట్టర్ ప్రపంచంలో స్వాగతం’ అంటూ మెగాస్టార్ చిరంజీవికి వెల్‌కమ్ చెప్పిన తారక్, ఆర్ఆర్ఆర్ మోక్షన్ పోస్టర్‌పై ఆయన వ్యాఖ్యలకు థ్యాంక్స్ చెప్పాడు.

సంగీత దర్శకుడు కీరవాణి కూడా మెగాస్టార్ ట్వీట్‌కు ‘థ్యాంక్యూ సార్’ అంటూ రిప్లై ఇచ్చారు. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో కాలక్షేపం చేస్తున్న చిరూ, ఇలా సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చి అటు అభిమానులను, ఇటు ఆర్ఆర్ఆర్ టీమ్‌ను సర్‌ప్రైజ్ చేశారు. చిరూ నుంచి ఇలాంటి పొగడ్త రావడంతో ఆర్ఆర్ఆర్ టీమ్‌తో పాటు అటు మెగా, ఇటు నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English