సురేందర్ రెడ్డి అసలేం చేస్తున్నాడు?

సురేందర్ రెడ్డి అసలేం చేస్తున్నాడు?

‘బాహుబలి’ లాంటి మెగా మూవీస్ రాజమౌళి లాంటి వాళ్లే కాదు.. తాను కూడా తీయగలనని చాటి చెప్పాడు సురేందర్ రెడ్డి. ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న భారీ చిత్రాన్ని తన స్థాయిలో చాలా బాగానే తీశాడతను.

సురేందర్ ఇలాంటి సినిమా తీయగలడని కచ్చితంగా ఎవ్వరూ ఊహించి ఉండరు. కొన్ని కారణాల వల్ల వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో ‘సైరా’ ఆశించిన ఫలితాన్నందుకోలేదు కానీ.. తెలుగు రాష్ట్రాల వరకు చాలా బాగానే ఆడింది.

 ఐతే ఇలాంటి సినిమా తీశాక సురేందర్‌కు మాంచి డిమాండ్ ఉంటుందని అంతా అనుకున్నారు కానీ.. అతను ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. ఈ సమయాన్ని కొత్త సినిమా స్క్రిప్టు కోసం ఉపయోగించుకుంటున్నట్లు భావించొచ్చు కానీ.. హీరో ఖరారయ్యాక కథ తయారు చేసుకునే సురేందర్‌కు ఇప్పటిదాకా ఏ హీరో కమిట్మెంట్ ఇచ్చినట్లు అయితే సమాచారం లేదు.

ప్రభాస్ అని.. మహేష్ బాబు అని సురేందర్ తర్వాతి సినిమా హీరోలుగా రకరకాల పేర్లు వినిపించాయి కానీ.. ఎవ్వరితోనూ సినిమా ఓకే కాలేదు. తాజాగా అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. అతడితో సురేందర్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రేసుగుర్రం’కి సీక్వెల్ చేయబోతున్నారని.. ఈ దిశగా చర్చలు సాగుతున్నాయని వార్తలొస్తున్నాయి.

ఐతే ఇంతకుముందు ‘కిక్’కు సీక్వెల్ తీస్తే ఫలితం ఏమైందో తెలిసిందే. ఆ సినిమాతోనే వక్కంతం వంశీతో సురేందర్‌కు చెడింది. అప్పట్నుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో వంశీ.. మళ్లీ సురేందర్‌తో పని చేయడం కష్టంగానే ఉంది. మరి ‘రేసుగుర్రం’ లాంటి నాన్ స్టాప్ ఎంటర్టైనర్‌కు సీక్వెల్‌గా వచ్చే సినిమా స్క్రిప్టును అంచనాలకు తగ్గట్లు తీర్చిదిద్దడం అంటే సవాలే. ఈ పని సురేందర్ చేయగలడా అన్నది డౌట్.

అసలు బన్నీ.. సురేందర్‌కు కమిట్మెంట్ ఇచ్చింది లేనిది తెలియడం లేదు. ‘సైరా’ లాంటి భారీ చిత్రం తర్వాత సురేందర్ ఇలాంటి అయోమయ స్థితిలో ఉంటాడని ఎవ్వరూ అనుకోలేదు. మరి అతడి తర్వాతి సినిమా ఎప్పుడు ఖరారవుతుందో చూడాలి.


 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English