చెలరేగిపోతున్న చిరంజీవి

చెలరేగిపోతున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మర్యాదరామన్న అవతారం ఎత్తాడు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ట్విట్టర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన ఆయన.. తొలి రోజు ఆచితూచి ట్వీట్లు వేశాడు.

తన ఆగమనాన్నిచాటుతూ.. కరోనా వైరస్ పట్ల అవగాహన పెంచే ట్వీట్‌తో మొదలుపెట్టిన చిరు.. మధ్యాహ్నం ‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్ గురించి ఓ ట్వీట్.. సాయంత్రం అమ్మతో దిగిన సెల్ఫీ గురించి ఓ ట్వీట్ వేశాడు. తనకు ట్విట్టర్లోకి వెల్కం చెప్పిన ఓ ముగ్గురు సెలబ్రెటీలకు థ్యాంక్స్ కూడా చెప్పాడు.

ఐతే రెండో రోజు మాత్రం చిరంజీవి ట్విట్టర్లో మామూలుగా రెచ్చిపోవట్లేదు. తనకు ట్విట్టర్లోకి ఆహ్వానం పలికిన ప్రతి ఒక్కరికీ బదులిస్తున్నాడు. అది జస్ట్ థ్యాంక్స్‌తో కూడా సరిపెట్టట్లేదు.

మోహన్ బాబు ‘మిత్రమా వెల్కం’ అంటే.. దానికి బదులుగా చిరు ‘థ్యాంక్ యూ మిత్రమా’ అని బదులివ్వడమే కాక.. ‘రాననుకున్నావా రాలేననుకున్నావా’ అంటూ ఇంద్ర డైలాగ్ పేల్చడం విశేషం. కాజల్‌కు బదులిస్తూ ‘అమ్మడూ..’ అని చిరు సంబోధించడం విశేషం.

పూరి జగన్నాథ్‌ వెల్కం ట్వీట్‌కు బదులుగా.. నువ్విప్పుడు ముంబయి, గోవా, బ్యాంకాక్ బీచ్‌లు మిస్సవుతుంటావేమో అని పంచ్ విసిరాడు. పూరి భార్య, కొడుకు పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ల క్షేమ సమాచారాలు అడిగాడు. ఇంకా తనకు వెల్కం చెప్పిన చాలా మందికి చిరు బదులిచ్చాడు.

చిరులోని ఈ ఉత్సాహం చూసి ట్విట్టర్ జనాలు ఆశ్చర్యపోతున్నారు. చిరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడని కొందరంటే.. ఆయన మర్యాదరామన్న అని.. ఆయన వ్యక్తిత్వం ఇలాగే ఉంటుందని ఇంకొందరంటున్నారు.

ఐతే చిరు ఇంత తీరిగ్గా ఇన్ని ట్వీట్లు సొంతంగా వేస్తున్నాడా అన్నది మాత్రం డౌటే. కచ్చితంగా చిరును సంప్రదిస్తూ ఈ అకౌంట్‌ను పీఆర్ టీం నడిపిస్తూ ఉంటుందనే భావిస్తున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English