చిరుతో ట్విట్ట‌ర్లో ఒక రోజు

చిరుతో ట్విట్ట‌ర్లో ఒక రోజు

మెగాస్టార్ చిరంజీవి ఉగాది సంద‌ర్భంగా అభిమానులకు పెద్ద స‌ర్ప్రైజే ఇచ్చారు. ఇక‌పై తాను సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌తో క‌నెక్ట‌యి ఉండాల‌న్న ఉద్దేశంతో ట్విట్ట‌ర్లోకి రానున్న‌ట్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించాడు. అన్న ప్ర‌కారం బుధ‌వారం ఉగాది ప‌ర్వ‌దినాన ట్విట్ట‌ర్లో అడుగు పెట్టారు. ముందుగా ఉగాది శుభాకాంక్ష‌లు చెప్పిన ఆయ‌న‌.. క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో అంద‌రం భాగ‌స్వాములం అవుదామంటూ తొలి ట్వీట్ వేశారు. దీన్ని త‌ర్వాత పిన్డ్ ట్వీట్‌గా మార్చారు.

తొలి రోజు దీంతో పాటుగా మ‌రో ముఖ్య‌మైన *సినిమా* ట్వీట్ కూడా వేశాడు చిరు. అది త‌న కొడుకు రామ్ చ‌ర‌ణ్ ఒక హీరోగా న‌టిస్తున్న ఆర్ఆర్ఆర్ గురించి కావ‌డం విశేషం. ఇప్పుడే మోష‌న్ పోస్ట‌ర్ చూశాన‌ని.. క‌నువిందుగా ఉంద‌ని.. గూస్ బంప్స్ వ‌చ్చాయని చెబుతూ రాజ‌మౌళితో పాటు జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల‌ను అభినందించాడు చిరు.

కొడుకు పేరును చివ‌ర‌గా ప్ర‌స్తావించి ముందు రాజ‌మౌళి, తార‌క్‌ల‌ను చిరు అభినందించ‌డం గ‌మ‌నార్హం. రాజ‌మౌళి ఈ ట్వీట్ చూసి ధ‌న్య‌వాదాలు చెప్ప‌గా.. చిరు తిరిగి థ్యాంక్స్ చెప్పారు. అలాగే త‌న‌ను ట్విట్ట‌ర్లోకి సాద‌రంగా ఆహ్వానించిన వాళ్ల‌లో మోహ‌న్ లాల్‌, సుహాసిని, రాధిక‌ల‌కు మాత్ర‌మే బ‌దులిచ్చాడు చిరు. వాళ్ల‌కు ఆయ‌న థ్యాంక్స్ చెప్పాడు. ఇక సాయంత్రం త‌న త‌ల్లి అంజ‌నాదేవితో క‌లిసి దిగిన ఫొటోను చిరు షేర్ చేస్తూ.. హెమ్ టైం మామ్ టైం అంటూ రైమింగ్‌తో ట్వీట్ చేశాడు.

ఈ స‌మ‌యంలో పెద్ద వాళ్ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవాలంటూ చిరు సూచ‌న చేశాడు. మొత్తంగా ట్విట్ట‌ర్లో చిరు తొలి రోజు ఇలా గ‌డిచింది. మొత్తంగా ఈ ట్వీట్ల వ్య‌వ‌హారం చూస్తే మాత్రం దాన్ని చిరు సొంతంగా కాకుండా పీఆర్ టీంతో న‌డిపిస్తున్నాడ‌నే సందేహాలు క‌లుగుతున్నాయి. బ‌హుశా ఆయ‌న‌తో సంప్ర‌దిస్తూ పీఆర్ టీం ట్వీట్లు వేస్తుండొచ్చు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English