రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

తెలుగువాళ్లకు ఉగాది పండుగ ఎంత ప్రత్యేకమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ రోజు సినిమా వాళ్లు కూడా చాలా మంచి దినంగా భావించి పెద్ద ఎత్తున కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు చేస్తుంటారు. అలాగే ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమాల కొత్త పోస్టర్లు రిలీజ్ చేయడం.. ఇంకేవైనా విశేషాలు పంచుకోవడం చేస్తుంటారు.

ఉగాది శుభాకాంక్షలతో పెద్ద ఎత్తున పోస్టర్లు దింపుతుంటారు. కానీ ఈసారి కరోనా కాటుతో జనాలంతా అల్లాడిపోతున్న నేపథ్యంలో ఎవరూ ఈ పండుగను సినిమాల ద్వారా సెలబ్రేట్ చేసే సాహసం చేయలేకపోయారు.

ఉగాదికి అనుకున్న చాలా ప్రారంభోత్సవాలు ఆగిపోయాయి. అలాగే పోస్టర్లు, టీజర్లు, ఇంకే విశేషాలు కూడా లేకపోయాయి. ఉగాది రోజు అసలు సినిమా ముచ్చట్లే ఉండవని అందరూ ఫిక్సయిపోయారు.

కానీ అందరూ ఒకలా ఆలోచిస్తే దర్శక ధీరుడు రాజమౌళి ఇంకోలా ఆలోచించాడు. కరోనా సంక్షోభ సమయంలో సెలబ్రేషన్ అన్నట్లు కాకుండా జనాలకు ఈ సమయంలో ఊరటనివ్వడానికి ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఈ కల్లోల సమయంలో ఈ మోషన్ పోస్టరేంటి అన్న ఫీలింగ్ జనాలకు కలగలేదు. దీన్నో ఉపశమనం లాగే చూశారు. ఎలాంటి నెగెటివిటీ లేకపోయింది.

 ఈ సమయంలో వేరే సినిమాల ముచ్చట్లేమీ లేకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రియులంతా కేవలం ‘ఆర్ఆర్ఆర్’ గురించి మాత్రమే మాట్లాడుకునేలా చేశాడు జక్కన్న. ఇది ఆయన ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. తన సినిమాను మార్కెట్ చేసుకోవడంలో రాజమౌళి తెలివితేటలు ఎలాంటివో మరోసారి రుజువైంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English