ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో.. దీనికి కూడా గొడవేనా?

ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో.. దీనికి కూడా గొడవేనా?

మెగా, నందమూరి హీరోలు బయట సన్నిహితంగానే ఉంటారు. ఒకరినొకరు విమర్శించుకోరు. ఏ రకరమైన శత్రుత్వం కనిపించదు. కానీ ఈ హీరోల అభిమానులు మాత్రం బయట తెగ గొడవలు పడేస్తుంటారు. ఇది చిరంజీవి, బాలయ్యల మధ్య బాక్సాఫీస్ పోరు మొదలైనప్పటి నుంచి ఉంది. దశాబ్దాలుగా ఈ అభిమానుల మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ తరం మెగా, నందమూరి హీరోలు ఎంతో సన్నిహితంగా ఉంటున్నా.. చివరికి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి సినిమా చేయడానికి రెడీ అయినా కూడా అభిమానుల గొడవలు ఆగట్లేదు. ఈ సినిమాలో ఎవరు ఎక్కువ హైలైట్ అవుతారు.. ఎవరి పాత్ర బాగుంటుంది.. సినిమా హిట్టయితే ఎవరికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి అనే విషయాల్లో ఏడాది కిందట్నుంచి సోషల్ మీడియాలో తెగ కొట్టేసుకుంటున్నారు ఇరు వర్గాల అభిమానులు.

ఇప్పుడు వాళ్లు మరింత కొట్టేసుకోవడం కోసమా అన్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో మోషన్ పోస్టర్ వచ్చింది. ఇందులో చరణ్‌ను నిప్పులా చూపిస్తే.. ఎన్టీఆర్‌ను నీటితో పోల్చారు. ఐతే నిప్పే గొప్పని చరణ్ ఫ్యాన్స్ అంటుంటే.. నీటికే శక్తి ఎక్కువ అని తారక్ అభిమానులు వాదిస్తున్నారు. ఇది కాక టైటిల్ లోగోలో చరణ్‌ను ముందు పెట్టి, తారక్‌ను వెనుక పెట్టడం గురించి కూడా చర్చ నడుస్తోంది. రాజమౌళి చరణ్‌కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడని తారక్‌కు తగ్గించాడని కొందరంటే.. మోషన్ పోస్టర్లో తారక్‌కే ఎక్కువ హైలైట్ అయ్యాడని ఇంకొందరు అంటున్నారు. మోషన్ పోస్టర్‌కే ఇలా కొట్టేసుకుంటే ఇక సినిమాలో వివిధ అంశాల మీద ఎలా గొడవ పడతారో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English