ఆర్ఆర్ఆర్.. వాయిదాల్లేవమ్మా

ఆర్ఆర్ఆర్.. వాయిదాల్లేవమ్మా

ఎవ్వరూ ఊహించని సమయంలో ఉన్నట్లుండి ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో గురించి అప్ డేట్ ఇచ్చి.. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే మోషన్ పోస్టర్ దించేశాడు రాజమౌళి. ఉగాది కానుకగా బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రిలీజైన ఈ మోషన్ పోస్టర్ కరోనా కల్లోలంలో చిక్కుకుని ఉన్న జనాల్ని ఆ చర్చలు విడిచిపెట్టి సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది.

ఈ సంక్షోభ సమయంలో సినీ ప్రియులందరికీ ఇది కొంచెం ఉపశమనం అనే చెప్పాలి. మోషన్ పోస్టర్ రిలీజ్‌తో ‘ఆర్ఆర్ఆర్’ కొన్ని సందేహాలకు కూడా తెరపడింది. ఈ సినిమాలో ఆలియా భట్ కథానాయిక స్థానం నుంచి తప్పుకుందన్న ఊహాగానాలకు తెరపడింది. సినిమా నటీనటుల జాబితాలో ఆమె పేరుంది. టైటిల్ లోగో అప్ డేట్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను కూడా ఆమె ట్విట్టర్లో షేర్ చేసింది.

మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ గురించి మరోసారి తలెత్తిన సందేహాలకు కూడా మోషన్ పోస్టర్ తెరదించింది. ఈ వీడియో చివర్లో టైటిల్ కింద 8 జనవరి 2021 అంటూ రిలీజ్ డేట్ స్పష్టంగా ప్రకటించారు. అంటే ఆ తేదీకి కట్టుబడి ఉన్నట్లే.

ఈ ఏడాది జులై 30కే రిలీజ్ కావాల్సిన సినిమాను.. వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేస్తూ కొన్ని నెలల కిందటే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కొన్ని షెడ్యూళ్లు తేడా కొట్టడం.. హీరోలిద్దరూ గాయపడటం.. ఇంకొన్ని ఇబ్బందుల కారణంగా సినిమాను ఐదు నెలలకు పైగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఐతే వచ్చే సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుని షూటింగ్ లాగిస్తుండగా.. కరోనా ఎఫెక్ట్‌తో మళ్లీ షెడ్యూళ్లు డిస్టర్బ్ అయ్యాయి.

దీంతో మరోసారి రిలీజ్ వాయిదా అనివార్యం అని వార్తలొచ్చాయి. ఐతే ఖాళీ సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఉపయోగించుకుంటూ అనుకున్న సమయానికే సినిమాను సిద్ధం చేసేలా రాజమౌళి అండ్ టీం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే 2021 జనవరి 8న సినిమాను రిలీజ్ చేయడం పక్కా అనిపిస్తోంది.


 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English