ఆర్ఆర్ఆర్.. నీరు-నిప్పు... కాన్సెప్టేదో బాగుందే

ఆర్ఆర్ఆర్.. నీరు-నిప్పు... కాన్సెప్టేదో బాగుందే

ఉత్కంఠకు తెరపడింది. దర్శక ధీరుడు రాజమౌళి కొత్త చిత్రం పేరేంట తెలిసిపోయింది. ఈ చిత్రానికి తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే పేరును ఖరారు చేశాడు జక్కన్న. ఉగాది కానుకగా బుధవారం మధ్యాహ్నం విడుదలైన మోషన్ పోస్టర్ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉండటంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. సినిమా మీద ఇప్పటికే భారీగా ఉన్న అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.

ఇక ఈ టైటిల్ లాంచ్ గురించి నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తేనే ఒక కాన్సెప్ట్ కనిపించింది. సినిమాలో ఇద్దరు కథానాయకుల చేతుల్ని పోస్టర్లో చెరో వైపు పెట్టారా పోస్టర్లో. ఒక చేతి చుట్టూ నీటి జల్లు కనిపిస్తే.. ఇంకో చేతి చుట్టూ నిప్పు రవ్వలు కనిపించాయి. అంటే హీరోల్లో ఒక పాత్ర నీటిని.. ఇంకో పాత్ర నిప్పును సూచిస్తుందన్నమాట. నీరు, నిప్పు ఒకదానికి ఒకటి విరుద్ధమైనవి. దేనికవే శక్తిమంతమైనవి. రెండూ కలిసి ప్రయాణించలేవు కానీ.. కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ కథను తీర్చిదిద్దినట్లున్నారు.

రాజమౌళి టైటిల్ పోస్టర్ గురించి వివిస్తూ.. ఈ నీరు-నిప్పు కాన్సెప్ట్ గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నీరు నిప్పును ఆర్పేయగలదని.. అలాగే నీటిని నిప్పు ఆవిరి చేయగలదని.. ఐతే ఇవి రెండు శక్తులు కలిస్తే తిరుగులేని శక్తి వస్తుందని అన్నాడు జక్కన్న. అంటే సినిమాలో ముందు నీరు, నిప్పు తరహాలో దూరం దూరంగా ఉండి.. తర్వాత ఒక లక్ష్యం కోసం పోరాడే యోధులుగా హీరోలు కనిపిస్తారని ఆశించవచ్చు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English