ఆహా.. మారుతికి అదిరే ఛాన్స్ ఇచ్చారట

ఆహా.. మారుతికి అదిరే ఛాన్స్ ఇచ్చారట

‘ఈరోజుల్లో’, ‘బస్‌స్టాప్’ వంటి యూత్ ఫుల్ మసాలా ఫిల్మ్ తీసిన మారుతి, ఆ తర్వాత రూట్ పూర్తిగా మార్చేసి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ‘భలే భలే మగాడివోయ్’ నుంచి ‘ప్రతిరోజూ పండగే’ దాకా మారుతి సినిమాలు చాలావరకూ అటు యూత్‌ను, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చాయి. దాంతో ఈ క్వారంటైన్ టైమ్‌లో మనోడితో ఓ మంచి డీల్ కుదుర్చుకున్నారట అల్లు అరవింద్.

ఇంతకుముందు అల్లువారి చిన్నబ్బాయి శిరీష్‌కు ‘కొత్తజంట’ సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చి, ఓ మోస్తరు హిట్టు ఖాతాలో వేసిన మారుతి, ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫాం ‘ఆహా’ను సూపర్ హిట్ చేసే బాధ్యత తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ నడుస్తోంది. జనాలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్ల మీద ట్రాఫిక్ తగ్గి, నెట్‌లో ట్రాఫిక్ పెరిగింది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లెక్స్‌ల్లో వెబ్ సిరీస్‌లకు మంచి డిమాండ్ పెరిగింది. ఇలాంటి టైమ్‌ను సరిగ్గా వినియోగించుకోలేకపోయారు అల్లు అరవింద్.

‘ఆహా’లో పెద్దగా సినిమాలు లేవు, చూడాలనిపించే వెబ్ సిరీస్‌లు ఇంకా రాలేదు. దాంతో ‘ఆహా’ కోసం వెబ్ సిరీస్‌ల స్క్రిప్ట్‌లను ఎంపిక చేసే బాధ్యత మారుతికి అప్పగించాడట అల్లుఅరవింద్. క్వారంటైన్ టైమ్‌లో ఇంట్లో ఖాళీగా కూర్చొన్న మారుతి, తన తర్వాతి సినిమా స్క్రిప్ట్ పనులను కూడా పక్కనబెట్టి... ఆహా కోసం యంగ్ దర్శకులు రాసిన కథలను వడబోస్తూ ‘ఆహా...’ అనిపించే వెబ్ సిరీస్‌లను ఎంపిక చేసే పనిలో బిజీ అయ్యాడట.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English