ఇది పవన్ కళ్యాణ్ కి టైలర్ మేడ్ రోల్!

ఇది పవన్ కళ్యాణ్ కి టైలర్ మేడ్ రోల్!

ఆచార్య చిత్రంలో ఒక కీలక పాత్రని రామ్ చరణ్ తో చేయిస్తున్న సంగతి తెలిసిందే. అదే పాత్ర కోసం మహేష్ బాబు పేరు అనుకోవడం, మహేష్ కూడా దానికి ఓకే చెప్పడం జరిగింది. కానీ బడ్జెట్ పరిమితుల వల్ల రామ్ చరణ్ తోనే ఆ పాత్ర చేయిస్తున్నారు.

ఇంత డ్రామా మధ్య సదరు పాత్రకి పవన్ కళ్యాణ్ పేరు పరిశీలించకపోవడం మెగా అభిమానులని ఆశ్చర్యపరచింది. పవన్ గతంలో శంకర్ దాదా జిందాబాద్ లో చిన్న పాత్ర చేసాడు కానీ చిరుతో కలిసి ఎక్కువ కనిపించలేదు. ఈ పాత్రని పవన్ తో చేయించాలనే ఆలోచన ఎందుకో మెగాస్టార్ కి కూడా రాలేదు. తీరా ఆ పాత్ర చూస్తే నక్సలైట్ పాత్ర అట. ఆ పాత్ర స్ఫూర్తితోనే ఆచార్య తన గోల్ ఏర్పాటు చేసుకుంటాడట.

పవన్ కి ఆ తరహా పత్రాలు ఇష్టమనేది అందరికీ తెలిసిందే. జల్సా చిత్రంలో కాసేపు నక్సలైట్ గా కూడా పవన్ కనిపించాడు. ఇది పవన్ కి టైలర్ మేడ్ క్యారెక్టర్ అనిపిస్తున్నా కానీ ఎందుకో చరణ్ తోనే వెళుతున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English