రిలీజ్ డేట్స్ టెన్షన్ లేదు... అదే ఆర్డర్లో!

రిలీజ్ డేట్స్ టెన్షన్ లేదు... అదే ఆర్డర్లో!

మరో మూడు వారాల నిర్బంధం తప్పదని ప్రధాని కచ్చితంగా చెప్పడంతో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి పెద్ద షాకే తగిలింది. ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ పనులు మొదలు పెట్టుకోవచ్చు అనే ఆశలకు బ్రేక్ పడింది. కనీసం ఏప్రిల్ 15 నుంచి అయినా మళ్ళీ అన్నీ మునుపటిలా ఉంటాయా లేదా అనేది ఇంకా తెలియదు.

ఇదిలాఉంటే ఇప్పుడు వాయిదా పడిపోయిన సినిమాల పరిస్థితి ఏమిటి? ఏ సినిమాలైతే వాయిదా పడ్డాయో అదే ఆర్డర్లో మళ్ళీ రిలీజ్ చేసుకోవడానికి నిర్మాతల మండలి ఓకే చెప్పింది. ఒకవేళ సినిమాలు వాయిదా వేసుకునే ఆలోచన ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్లొచ్చు లేదా క్లాష్ కి సిద్ధపడవచ్చు.

లేదంటే ఇంతకు ముందు అనుకున్న ఆర్డర్ అలాగే కొనసాగుతుంది. రిలీజ్ డేట్స్ పరంగా ఇబ్బందులు ఏమి ఉండవు కానీ అసలు సమస్య మిగతా షూటింగ్ బాలన్స్ ఉన్న వారి సంగతి. ఇన్ని రోజులు పనులు ఆగిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్ అంత ఈజీగా దొరకరు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English