ఆ రీమేక్ కోసం బాలయ్యను అడుగుతున్నారట

ఆ రీమేక్ కోసం బాలయ్యను అడుగుతున్నారట

టాలీవుడ్లో రీమేక్ సినిమాలకు దూరంగా ఉండే స్టార్లు కొందరున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు నందమూరి బాలకృష్ణను కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు. తన తోటి సీనియర్ హీరోలు చాలా రీమేక్‌ల్లో నటించారు కానీ.. బాలయ్య మాత్రం వాటికి దూరంగా ఉంటుంటాడు.

‘లక్ష్మీనరసింహ’ లాంటి ఒకటీ అరా తప్ప ఆయన కెరీర్లో రీమేక్‌లు పెద్దగా కనిపించవు. మంచో చెడో మన కథల్నే ఆయన నమ్ముకుంటాడు. అలాంటి హీరో వద్దకు ఇప్పుడు ఓ రీమేక్ ప్రపోజల్ వెళ్లినట్లు సమాచారం.

మలయాళంలో ఈ మధ్యే సూపర్ హిట్టయిన ‘అయ్యప్పనుమ్ కొశియుమ్’ రీమేక్ హక్కుల్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ రీమేక్ కోసం హీరోలుగా ఎవరు బాగుంటారనే పరిశీలన జరుగుతోంద. మలయాళంలో బిజు మీనన్ చేసిన పోలీస్ పాత్ర కోసం బాలయ్యను తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారట. ఇందుకోసం ఆయనతో సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు సమాచారం.

ఐతే ఇంతకుముందు కూడా బాలయ్య ముందుకు కొన్ని రీమేక్ ప్రతిపాదనలు వెళ్లినా ఆయన ఓకే చేయలేదు. ‘విక్రమ్ వేద’ రీమేక్ కోసం ఆయన్ని అడిగినట్లు కూడా ప్రచారం జరిగింది.

కానీ రీమేక్‌ల పట్ల ఉన్న వ్యతిరేకతతో బాలయ్య ముందడుగు వేయలేదు. ఐతే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో, కెరీర్ బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో సక్సెస్ కోసం బాలయ్య రీమేక్ బాట పడతాడేమో చూడాలి. ఈ సినిమాకు దర్శకుడెవరన్నది కూడా ఇంకా ఖరారవ్వలేదు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English