అనుష్క ఎట్టకేలకు సినిమా ఒప్పుకుంది

అనుష్క ఎట్టకేలకు సినిమా ఒప్పుకుంది

లేడీ సూపర్ స్టార్ అనుష్క కొన్నేళ్లుగా చాలా సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటోంది. ‘బాహుబలి’ మినహాయిస్తే స్టార్ హీరోల సరసన ఆమె సినిమాలు చేయలేదు. అది కాకుండా ‘భాగమతి’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసిన అనుష్క.. త్వరలోనే ‘నిశ్శబ్దం’ అనే మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది.

దీని తర్వాత అనుష్క ఏ సినిమా చేస్తుంది.. అసలు సినిమాలు చేస్తుందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘ఆచార్య’లో ఆమె హీరోయిన్‌గా ఎంపికవుతుందన్న ప్రచారం జరిగింది కానీ.. ఆ స్థానాన్ని కాజల్ అగర్వాల్ దక్కించుకుంది.

దీంతో అనుష్క తర్వాత ఏ సినిమాలో చేస్తుందన్న ఉత్కంఠ జనాల్లో పెరిగిపోయింది. ఆమె త్వరలో ఓ తమిళ సినిమా చేసే అవకాశాలున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రాబోయే ‘వేట్టయాడు విలయాడు’ (రాఘవన్) సీక్వెల్లో అనుష్క నటించనుందట.

ఒరిజినల్లో కమల్ హీరోగా నటించగా.. సీక్వెల్‌లో ఆయన స్థానంలో సూర్య నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. అనుష్కతో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడానికి గౌతమ్ గతంలో సన్నాహాలు చేశాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. వీళ్లిద్దరి కలయికలో ఇంతకుముందు ‘ఎంతవారు గానీ’ సినిమా వచ్చింది.

మళ్లీ ఇప్పుడు ‘వేట్టయాడు విలయాడు’ సీక్వెల్‌తో గౌతమ్, అనుష్క రీయూనియన్ జరగబోతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English