పరశురామ్ కోర్టులో బాల్ పెట్టిన మహేష్!

పరశురామ్ కోర్టులో బాల్ పెట్టిన మహేష్!

మహేష్ మలి చిత్రం పరశురామ్ డైరెక్షన్ లో ఖరారయింది. అందులో ఎలాంటి తేడాలు ఉండవు. వేరే కథలు వింటున్నా కానీ నెక్స్ట్ సినిమా అయితే పరశురాంతోనే అని మహేష్ ఫిక్స్ అయ్యాడు. అయితే ఇందులో ఒక పితలాటకం ఉంది.

మహేష్ దగ్గరకు పరశురామ్ ని తీసుకొచ్చింది మైత్రి మూవీ మేకర్స్. కానీ పరశురామ్ మలి చిత్రం 14 రీల్స్ ప్లస్ కి చేయడానికి అంగీకరించాడు. ఒప్పందం ప్రకారం పరశురామ్ వాళ్ళకి సినిమా చేసి తీరాలి. లేదంటే వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవుతారు.

ఇది మహేష్ కి కూడా తెలుసు. దీంతో ఆ రెండు బ్యానర్ లు కలిసి ఈ చిత్రం చేసేలా సంధి కుదర్చాలని పరశురామ్ కే మహేష్ భాద్యత అప్పగించాడు. వాళ్ళు ఎలాంటి ఒప్పందానికి వస్తారో, ఎంత వాటా తీసుకుంటారో తనకు సంబంధం లేదని, అవన్నీ తేల్చుకుని రమ్మని తేల్చేసాడు. దీంతో ఈ రెండు నిర్మాణ సంస్థల మధ్య ఒప్పందం కోసం పరశురామ్ కసరత్తు చేస్తున్నాడు.

మరి 14 రీల్స్ ని ఒప్పించి వారికి తదుపరి చిత్రం చేస్తాడో లేక మహర్షికి జరిగినట్టు మూకుమ్మడి వ్యవహారం నడుస్తుందో ప్రస్తుతానికి స్పష్టత లేదు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English