వెంకటేష్ - రాణాకి భలే సెట్టవుతుంది!

వెంకటేష్ - రాణాకి భలే సెట్టవుతుంది!

మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు హీరోలు నటించిన ఈ సబ్జెక్టు తెలుగులో ఎవరితో తీస్తారనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

మలయాళ ఒరిజినల్ చుసిన వాళ్ళు దీన్ని తెలుగులో వెంకటేష్, రాణాతో తీస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. బాబాయ్ అబ్బాయ్ లని కలిపే కథ కోసం చాలా కాలంగా వేట జరుగుతోంది. సురేష్ బాబు అయితే ఇందుకోసం కొన్ని వందల కథలే విన్నారు.

అయితే తెలుగు రైటర్లు ఎవరూ ఈ కాంబినేషన్ కి సెట్టయ్యే కథ పట్టుకురాలేదు. ఈ మలయాళ కథలో హీరోలిద్దరూ పోటాపోటీగా ఉంటారు. వెంకీ, రాణా వయసుకి కూడా సెట్ అయ్యేలా ఆ పాత్రలు ఉంటాయి.

బాబాయ్ అబ్బాయ్ సినిమా అనగానే జనం ఎలాంటి కథలయితే ఆశిస్తారో అందుకు భిన్నంగా ఉండడం ఈ చిత్రం స్పెషాలిటీ. మరి నిర్మాతలు ఎవరి పేర్లు పరిశీలిస్తున్నారో కానీ వెంకీ రానా అయితే బాగుంటుందని సోషల్ మీడియాలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English