బాలయ్యకు అనిల్ రావిపూడి బిస్కెట్

బాలయ్యకు అనిల్ రావిపూడి బిస్కెట్

నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని ఆ మధ్య యువ దర్శకుడు అనిల్ రావిపూడి గట్టిగా ప్రయత్నించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకు ‘రామారావు’ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాతే అనిల్ ‘ఎఫ్-2’ సినిమా తీశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. వీళ్ల కలయికలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా మంచి విజయమే సాధించింది.

కానీ ఈ సినిమా తర్వాత అనిల్‌కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావట్లేదని ఇండస్ట్రీలో డిస్కషన్ నడుస్తోంది. ప్రస్తుతం అతను ‘ఎఫ్-2’ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత బాలయ్యతో సినిమా చేయాలని అనిల్ చూస్తున్నాడన్న సందేహాలు కలుగుతున్నాయి.

తాజాగా తరుణ్ భాస్కర్ మొదలుపెట్టిన టాక్ షోకు అతిథిగా వచ్చాడు అనిల్ రావిపూడి. ఇందులో నువ్వు సినిమా చేయాలనుకునే హీరోలెవరు అని అడిగితే బాలయ్యతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ పేరు కూడా అనిల్ చెప్పడం విశేషం. బాలయ్య ఇప్పుడున్న స్థితిలో అనిల్‌తో సినిమా చేసే అవకాశం వస్తే ఆయనే అదృష్టవంతుడిగా ఫీలవ్వాలి. కానీ అనిల్ మాత్రం బాలయ్యతో సినిమా చేయడం డ్రీమ్ అన్నట్లుగా మాట్లాడాడు.

బాలయ్య గురించి ఇలా చెప్పడంలో ఆశ్చర్యం లేదు కానీ.. మోక్షజ్ఞ పేరెత్తి అతడితో సినిమా చేయాలనుకుంటున్నట్లు బాలయ్యకు అనిల్ బిస్కెట్ వేయడమే షాకింగ్. మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. మూణ్నాలుగేళ్ల కిందటే అతను హీరో కావాల్సింది. కానీ అతడికి ఆసక్తి లేక ఇంకా ఇటు వైపు అడుగులేయలేదని తెలుస్తోంది. ఈ మధ్య బాగా షేపవుట్ అయి కనిపించిన మోక్షజ్ఞను చూస్తే అతను సినిమాల్లోకి రావడమే సందేహంగా ఉంది. అలాంటి కుర్రాడితో అనిల్ సినిమా చేయాలని ఆశపడటమేంటో?

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English