ప్రభాస్ వచ్చేశాడు... భయం మొదలైంది

ప్రభాస్ వచ్చేశాడు... భయం మొదలైంది

టాలీవుడ్‌లో షూటింగ్‌లన్నింటికీ బ్రేకులు పడినా, తాను మాత్రం ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా ఓ షెడ్యూల్ ముగించేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అది కూడా జార్జియాకు వెళ్లి మరీ! మనోడి స్పీడ్‌కు ముచ్చట పడాలో, కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో ఇలాంటి సాహసాలు అవసరమా... అని కంగారు పడాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు డార్లింగ్ ఫ్యాన్స్.

జార్జియాలో షూటింగ్ ముగించుకుని, స్వదేశానికి వచ్చేశాడు ప్రభాస్. అయితే అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. విదేశాల నుంచి, ముఖ్యంగా యూరప్ దేశాల నుంచి భారతీయులపై ప్రత్యేకంగా నిఘా పెడుతోంది భారత ప్రభుత్వం. కరోనా వైరస్ బారిన పడలేదని నిర్ధారణ అయ్యేవరకూ 14 రోజుల పాటు క్వారంటైన్ చేస్తున్నారు అధికారులు. దీంతో జార్జియాలో షూటింగ్ ముగించుకుని వచ్చిన ప్రభాస్‌లో ఆ లక్షణాలు ఏవీ లేవని తేలేవరకూ ఫ్యాన్స్‌కు టెన్షన్ తప్పదు.

యంగ్ రెబల్ స్టార్‌తో జార్జియా షెడ్యూల్‌లో పాల్గొన్న హీరోయిన్ పూజా హెగ్దే, తదితర చిత్ర యూనిట్ కూడా ఈ పరీక్షలన్నీ ఎదుర్కోవాల్సిందే. ఒక్కరిలో లక్షణాలు కనిపించినా... ఆ వ్యక్తితో కలిసి పనిచేశారు కాబట్టి మిగిలిన అందరూ బుక్ అయినట్టే... సో ఈ కథలో క్లారిటీ రావాలంటే చాలా సమయమే పుడతుంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English