దేవరకొండ చెప్పి మరీ కొట్టాడు

దేవరకొండ చెప్పి మరీ కొట్టాడు

విజయ్ దేవరకొండకు యూత్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో.. అమ్మాయిలు అతడంటే ఎలా పడిచస్తారో మరోసారి రుజువైంది. అతను వరుసగా రెండో ఏడాది కూడా హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో అగ్రస్థానం సంపాదించడం విశేషం. 2017లో రెండో స్థానంలో ఉన్న అతను.. గత ఏడాది తొలిసారిగా ఈ జాబితాలో అగ్రస్థానం సంపాదించాడు.

ఆ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను తర్వాతి ఏడాది కూడా అగ్రస్థానంలోనే ఉంటానని విజయ్ చెప్పడం విశేషం. అన్నట్లే ఈసారి కూడా అతను నంబర్ వన్‌గా నిలవడం విశేషం. విజయ్‌తో పోలిస్తే చాలా పెద్ద స్టార్ అయిన రామ్ చరణ్ రెండో స్థానంలో నిలిచాడు. యువ కథానాయకుడు రామ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాతి స్థానాలు సాధించారు. వరుణ్ తేజ్ (7), సుధీర్ బాబు (8), ప్రదీప్ మాచిరాజు (9) టాప్-10లో

 ఉన్నారు. నాగచైతన్య 11వ స్థానంలో నిలవగా.. అల్లు అర్జున్ 12వ ర్యాంకు సాధించాడు. జూనియర్ ఎన్టీఆర్ 19వ స్థానంలో ఉన్నాడు. విజయ్ దేవరకొండకు తానేం తక్కువ అన్నట్లు మాట్లాడే విశ్వక్సేన్ ఈ జాబితాలో 30వ స్థానంలో నిలవడం గమనార్హం.

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్-2019 జాబితా ఇదే..

1.     విజయ్ దేవరకొండ

2.     రామ్ చరణ్

3.     రామ్ పోతినేని

4.     ప్రభాస్

5.     సల్మాన్ జైది

6.     బసీర్ అలీ

7.     వరుణ్ తేజ్

8.     సుధీర్ బాబు

9.     ప్రదీప్ మాచిరాజు

10.   ప్రణవ్ చాగంటి

11.  నాగచైతన్య

12.  అల్లు అర్జున్

13.  రోహిత్ ఖండేల్వాల్

14.  అఖిల్ అక్కినేని

15.   నవదీప్

16.  మహ్మద్ సిరాజ్

17.  సమీర్ ఖాన్

18.  శ్రావణ్ రెడ్డి

19.  జూనియర్ ఎన్టీఆర్

20.  కార్తికేయ

21.  శర్వానంద్

22.  కిదాంబి శ్రీకాంత్

23.  నితిన్

24.  తరుణ్ భాస్కర్

25.  ఆది పినిశెట్టి

26.  సందీప్ కిషన్

27.  నాని

28.  నవీన్ పొలిశెట్టి

29.  అడివి శేష్

30.  విశ్వక్సేన్

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English